Migrant Labour | వలస కూలీలు | telugu


Migrant Labour | వలస కూలీలు | telugu

Migrant Labour | వలస కూలీలు | teluguMigrant Labour | వలస కూలీలు | telugu
Migrant Labour:వలస కూలీలు: ఔరా ఏమి విచిత్రము, రాష్ట్రాల వ్యాప్తంగా వలస కూలీలు లక్షలు దాటి ఉన్నారని, దేశ వ్యాప్తంగా కూలీలు కోట్ల సంఖ్యలో లో ఉన్నారని ఇప్పుడే తెలుస్తోంది మనకు, మన దేశీయులకు, మన ప్రభుత్వాధికారులకు,మన పాలకులకు.

వలస కూలీలు: రోడ్ల వెంబడి వలస కూలీలు పుట్టలలో కన్పించే చీమలలాగా ఎక్కడ,ఏ రోడ్లలో చూసినా వలస కూలీలే! ఇంతమంది వలస కూలీలు దేశ వ్యాప్తంగా ఉన్నారని అంచెనా వేయలేని ప్రభుత్వాలు వెనుకా,ముందూ ఆలోచించకుండా లాక్డౌన్ ప్రకటించారు.

ప్రభుత్వం ముందు జాగ్రత్తలు: మొదటి సారి లాక్డౌన్ చేసినప్పుడు వలసకూలీల గురించి ప్రభుత్వం గమనించలేదంటే ఒక అర్థం ఉంది. కనీసం రెండవసారి లాక్డౌన్ చేసినప్పుడు వలస కూలీలు గురించి ఏదైనా రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి వారిని, వారి వారి గమ్యస్థానాలకు చేర్చి ఉంటే చాలా బాగుండేది. కాని, మూడవ సారి లాక్డౌన్ పొడిగించినప్పుడు కూడా దాదాపు చాలా రాష్ట్రాలలో  రవాణా సౌకర్యం ఏర్పాటు చేయలేకపోయారు. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు ఇవ్వలేక పోయింది.
ప్రభుత్వాధికారుల అలసత్వం:  ప్రభుత్వాధికారులు సరియైన సమయంలో సరైన ఫీడ్ బ్యాక్ ప్రభుత్వానికి అందివ్వలేక పోయారు. బహుశా, వారి దైనందిన సేవా కార్యాక్రమము లో నిమగ్నమవ్వటం, అలసి పోవటం కావొచ్చు, ఏది ఏమైనా, వలస కూలీలు మాత్రం చాలా బాధలు అనుభవించారు. ఇప్పటికీ అనుభవిస్తున్నారు.
వలస కూలీల భయం: వలస కూలీల భయమంతా వారి కుటుంబ సభ్యుల గురించే. చాలా మంది  వలస కూలీలు వారి తల్లిదండ్రులను, పిల్లలను ఇంటిదగ్గరే ఉంచి వచ్చారు. ఎలాగైనా కరోనా తగిలి చనిపోకముందే వారిని కళ్ళారా చూడాలనే భయం గంట,గంటకు పెరిగిపోతుంది. సోషల్ మీడియా లో వచ్చు రక రకాల వార్తలు వారి భయాలను ఇంకా రెట్టింపు చేస్తున్నాయి. వారి స్థానంలో మనం ఉంటే తప్ప ఇటువంటి బాధలు అర్థం కావు. అందుకే ప్రాచీనకాలంలో రాజుల పరిపాలనలో భాగంగా, వారు మారు వేషంలో ఊళ్లలో, రోడ్లలో తిరిగి ప్రజలు ఏమంటున్నారో స్వయంగా తెలుసుకుని  పరిపాలన చేసేవారు. ఈ పద్దతిలో సాద్యమైనంత వరకు పరిపాలనా నిర్ణయాలలో తప్పులు జరిగేందుకు అవకాశం ఉండదు.
కొన్ని హృదయ విధారక సంఘటనలు: నిజం చెప్పాలంటే, హృదయ విధారక సంఘటనలు చాలానే జరిగాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఈ సంఘటనలు జరిగాయి. ఆ వార్తలు, ఫోటోలు మీరు చాలామంది వార్తా పత్రికలలో మరియు టీ.వి లు మొబైల్ లో చూసేఉంటారు.
మానవుడు కొన్ని పదుల సంఖ్యలలో కిలోమీటర్ల దూరం నడవాలంటేనే కష్టం, కష్టమే కాదు, చాలా కష్టం.అటువంటిది కొంతమంది వందల సంఖ్యలో కిలోమీటర్లు నడవటం. అనగా దాదాపు, ఆరు వందలు, ఎనిమిది వందలు కిలోమీటర్లు నడవటం. మరి కొంతమంది ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంనకు వేల కిలోమీటర్లు నడవటం జరిగింది. ఈ వార్తలు వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది. అందులో అక్కడక్కడా వేసవి వేడిమికి తట్టుకోలేక, సరయిన ఆహారం, విశ్రాంతి లేక చనిపోయిన వారు ఉన్నారు.
ఇది ఒక హృదయవిదారకం. కొంతమంది తమ పిల్లలను, తల్లులను బుట్టలలో కూర్చోబెట్టి మోస్తూ కాలినడక చేసినవారు ఉన్నారు. ఇది మరో హృదయవిదారకం.
అంతర్రాష్ట వలస కూలీలు రోడ్ మార్గం పొడవు ను తగ్గించుకునేందుకు వీలుగా రైల్వే ట్రాక్ గుండా ప్రయాణించడం ప్రారంభించారు. వారు తమ నడకలో అలసిపోయి ఒక రైల్వే స్టేషన్ లో రాత్రి తమ నిద్రను రైల్వే ట్రాక్ మీద కొనసాగించారు. వారి ఉద్దేశ్యం, దేశమంతా బంద్ ఉంది కదా, రైళ్లు కూడా తిరగవని అనుకుని పొరపాటుబడ్డారు. వారు నిద్రిస్తున్న సమయంలో ఒక గూడ్స్ రైలు ఆ పట్టాల మీద వచ్చి వారి మీదుగా వెళ్లడంతో వారు స్పాట్ లో ఘోరంగా చనిపోయారు.
ఉత్తరప్రదేశ్ లో 16.05.20 తేదీన ట్రక్కు లో ఉన్న కూలీలను ట్రెయిలర్ ఢీ కొనగా 25 మంది వలస కార్మికులు చనిపోయారు. 40 మండి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జాతీయ రహదారి - 19 పై జరిగింది.
కొన్నిచోట్ల వలస కార్మికులు భయపడి హార్ట్ ప్రాబ్లం తో చనిపోయినట్లు తెలిసినది.
ఇలాటి దురదృష్ట సంఘటనలు దేశవ్యాప్తంగా జరిగాయి.
ప్రభుత్వము అలసత్వం: ప్రభుత్వం వెనుక, ముందు చూడకుండా తొందరపాటు నిర్ణయాలు కూడా ఒక కారణం. లక్డౌన్ ప్రకటించే ముందు వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర వెర్చే కార్యక్రమం చేపట్టిఉంటే చాలా,చాలా బాగుండేది. ఎలాగూ చేతిలో ప్రభుత్వ రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ప్రభుత్వం కేవలం ఆయా సంబంధించిన డెపార్ట్మెంట్స్ కు ఉత్తర్వులు ఇచ్చి ఉంటే సరిపోయేది.
న్యూస్ ఛానెల్స్ అలసత్వం:  ఏదైనా సమస్యకు న్యూస్ ఛానెల్స్ త్వరగా స్పందించేవి. కానీ, వలస కార్మికుల విషయంలో న్యూస్ ఛానెల్స్ త్వరగా స్పందించలేదనే అనిపిస్తోంది. ప్రభుత్వం కు సత్వర సూచనలు ఇవ్వలేదు.
న్యూస్ ఛానెల్స్ వలస కార్మికుల సమస్యలు ఆలస్యంగా గుర్తించాయి. గుర్తించిన తర్వాత కూడా వారు ఆయా సమబంధిత ఏం.ఎల్.ఎ లు ఎం.పి ల దృష్టికి సూటిగా తీసుకు పోలేదనే అనిపిస్తోంది.

ముగింపు:

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు అనేక ఇబ్బందులు గురయ్యారు. అన్ని దేశాల ప్రభుత్వాలు, ఏమి చేయాలో, ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, తమ పరిధిలో ఉన్న నిర్ణయం ఇచ్చుకుంటూ వెళ్లారు. ఇందులో ఎవరినీ తప్పు పట్టలేని పరిస్థితి. ఇది ప్రజల దురదృష్టం.

అన్ని డిపార్ట్మెంట్లకు, ముఖ్యంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పోలీసు, ట్రాన్స్ పోర్ట్ వారలకు,  వలస కార్మికుల ను గుర్తించి వారిని వారి స్వస్థలాలకు క్షేమంగా ప్రభుత్వ వాహనాలలో పంపే ఏర్పాటు చేసి ఉంటే ప్రభుత్వం “శహాభాస్” అనిపించుకుని ఉండేది. ఇప్పటికైనా ఈ చర్యలు అవుసరం. కనుక వెంటనే ఈ చర్యలు చేపట్టవలెనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనవి. ఇందులో ఏమైనా అతిగా చెప్పివుంటే మన్నించ మనవి.

Post a Comment

0 Comments