70 times Growth in E.P.S 95 Capital

26 సంII రాలలో E.P.S. 95 మూలధనంలో వృద్ధి 70రెట్లు

పెన్షనరుకు పెరిగిన పెన్షన్ జీరో

దేశపురోభివృద్ధిలో కార్మికుల భాగస్వామ్యం ఎంతైనా వున్నది అక్రమంలో పారిశ్రామిక ప్రగతి ఎంత మేరకు వృద్ధి చెందినదో మనము చూడకల్గుచున్నాము. దానికి బి వారి భవిష్యత్ ప్రయోజనాలకై ఉద్దేశించబడిన సంక్షేమపథకాలు లోపభూయిష్టంగా తయారుకాబడి కాలానుగుణంగా మెరుగుపరచక ఈరోజున వారి జీవిత చరమాంకంలో కనీసావసరాలు తీర్చలేని విధంగా చతికిలబడివున్నాయి. అందులకు ప్రభుత్వాలు వారిపట్ల చూపుతున్న ఉదాసీనత, పూర్తి నిర్లక్ష్యం ప్రభల కారణమని చెప్పక తప్పదు.

ఉద్యోగి పదవీ విరమణ అనంతరము వారి శేష జీవితము సౌకర్యవంతముగా గడుపుటకు వీలు కల్పించే విధంగా 01-03-1971వ సంవత్సరములో ఎంప్లాయిస్ ఫామిలీ పెన్షన్ స్కీము ప్రవేశపెట్టారు. ఆ స్కీము ననుసరించి ఉద్యోగియొక్క బేసిక్ వేతనం మరియు D.A.తో కలిపిన మొత్తానికి 2.32% కాంట్రిబ్యూషన్ మినహాయించి స్కీమునకు జమచేయబడి దురదృష్టవశాత్తు ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే అతని కుటుంబానికి జీనానాధారముగా 07-03-1971 నుంచి ఎంప్లాయిస్ ఫామిలీ పెన్షన్ స్కీము ప్రవేశపెట్టబడినది.. దాని స్థానంలో 16-11- 1995 లో E.P.S.95 స్కీమును మరింత వెసులుబాటు కలిగించే విధంగా ఉద్యోగి అంతకుముందు ఉన్నటువంటి కాంట్రిబ్యూషన్ ను 2.32% నుంచి 8.33% వరకు పెంచడం జరిగినది. అయితే ప్రభుత్వం తన వంతు వాటాగా ఉద్యోగి తరుపున చెల్లించే భాగం ఏమాత్రం సారూప్యత లేక ఫామిలీ పెన్షన్ స్కీములో ఎంత అయితే జామకాబడినదో అంటే మొత్తము (1.16%) మాత్రమే చెల్లించడం జరుగుచున్నది.

2013 వ సంవత్సరములో కోషియార్ కమిటీ ప్రభుత్వం పండుకు జమచేస్తున్న భాగాన్ని 1.16% నుంచి 8.33% వరకు పెంచి తద్వారా కనీస పింఛను 3000 రూపాయలు D.A.తో కలిపి ఇవ్వవలసినదిగా ప్రభుత్వాన్ని తన నివేదికలో కోరింది. 1971 ఫామిలీ పెన్షను స్కీములో వున్న ఉద్యోగుల సర్వీసును పెన్షనబుల్ సర్వీసుగా పరిగణలోనికి తీసుకోవాలని సుభాష్ చంద్ర బెనర్జీ మరియు E.P.F.O.ల మధ్య వాదనలననుసరించి NATIONAL_CONSUMER DISPUTES REDRESAL COMMISSION 21-10-2016న తన తీర్పులో పేర్కొంది. 1971 – 1995 సంవత్సరాల మధ్య కాలంలో సర్వీసు చేసిన ఉద్యోగులకు పెన్షనబుల్ సర్వీసుగా పరిగణనలోనికి తీసుకోనిపోవుటచేత ఇప్పటి కాలానికి 70 సంవత్సరములు ఆపైబడిన వయస్సులో వున్న పెన్షనర్లకు పెన్షన్ లో చాల భాగం నష్టం వాటిల్లుచున్నది.

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

1971 ఫామిలీ పెన్షను స్కీములో నిల్వవున్న మూలధనము 8419.54 కోట్ల రూపాయలు E.P.S. 95 స్కీములోనికి తీసుకొనిరాబడినది. ఆ నిల్వ 31-03-2021 నాటికి 5,93,546.52 కోట్ల రూపాయలకు చేరింది. దీనికి కారణం 31-03-2021 నాటికి

2

నెలవారీగా ఉద్యోగస్తులు చెల్లించిన కాంట్రిబ్యూషన్ 3,81,175.64 కోట్లమీద వచ్చిన వడ్డీ 2,81,859.71 కోట్ల రూపాయలకుగాను కేవలం పెన్షన్ చెలింపులకు 97,513.30 కోట్ల రూపాయలు (34.6%) మరియు పెన్షనుకు అర్హులు కానివారు ఉపసంహరించుకొన్న మొత్తం 72,669.13 కోట్ల రూపాయలు (25.78%) చెల్లించడమే. నెలవారీ క్రమం తప్పకుండా మరియు సంవత్సరములో కనీసం ఒక నెల చెల్లింపు చేసినా కూడా ఉద్యోగస్తుల సంఖ్య 31-03-1997 నాటికి 1,93,15,286 నుంచి 31-03-2019 నాటికి 22,91,93,593 మాత్రమే పెరిగింది. అనగా 12 రెట్లు మాత్రమే. అయితే మూలధనం 31-03-1995 నుంచి 31-03-2021 వరకు 70 రెట్లకు చేరి 5,93,546.52 కోట్ల మేర వృద్ధి నమోదు అయింది.

HIGH_EMPOWDERRED MONITORING COMMITTEE ప్రభుత్వానికి యిచ్చిన నివేదిక ప్రకారము 2021-2022 లో 51,32,383 పెన్షనర్లకు నెలకు కేవలము 544.43 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగినది. అనగా సగటు నెలకు కేవలము పెన్షన్ వొక్కరిపై 1,061 రూపాయలు మాత్రమే చెల్లించారు. E. P. S. 95 స్కీములో ఉద్యోగస్తుడు చెల్లిస్తున్న కాంట్రిబ్యూషన్‌కు వడ్డీ కలిపితే వచ్చే మొత్తము మీద నెలవారీ వడ్డీ మాత్రమే పెన్షన్ క్రింద చెల్లించబడుతుంది. అసలు దాని మీద వడ్డీ ప్రభుత్వపరము అవుతుంది. దానికి సాక్షిగా 2020-21 వరకు E.P.F.O విడుదల చేసిన వార్షిక నివేదిక సంకలనము ప్రకారము తెలియుచున్నది.

ఆదాయం / కాంట్రిబ్యూషన్లు:

1) ఉద్యోగస్తులనుంచి జమకాబడిన చందా CR (88%)

3,81,175.64

2) ఉద్యోగస్తుల తరుపున ప్రభుత్వం చెల్లించిన వాటా CR (12%)

51,829.67

CR(100%)

4,33,005.31

వడ్డీ: 1)16-11-1995 నుంచి 31-03-2021 వరకు కాంపౌండు వడ్డీ

(88%) (నెలవారీ జమ కాబడిన కాంట్రిబ్యూషన్ మీద)

2,81,859.71 CR

2) ప్రభుత్వం చెల్లించిన కాంట్రిబ్యూషన్ మీద వచ్చిన వడ్డీ 38,435.41 CR (12%)

3

మొత్తం

3,20,295.12 CR

(100%)

ఖర్చులు:

97,513.30

1) నెలవారీ చెల్లించిన పెన్షన్లు CR (34.60%)

2) ఉపసంహరించుకొన్న మొత్తం (25.78%)

72,669,13 CR

3) భవిష్యత్ పెన్షన్ చెల్లింపుల కోసం మరియు ఉపసంహరణ – CR (39.62%)

1,11,677.28

నిమిత్తం ఉంచిన నిల్వ

2,81,859.71 CR

(100%)

E.P.S.95 ఉద్యోగస్తుల నెలవారీ చెల్లింపులు కాకుండా దానిమీద వచ్చే వడ్డీలో కొంతభాగం కూడా ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాల నిమిత్తం వినియోగించబడుతుంది. E.P.F.O ఉద్యోగుల జీతభత్యాలు మరియు వారి పెన్షన్లు మరియు ఇతరత్రా ఖర్చుల నిమిత్తం కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు లేవు. ఈ ఖర్చంతా కార్మికుల యజమాన్యము ద్వారా వచ్చిన సొమ్ములో అడ్మినిస్ట్రేషన్ మరియు ఇన్స్పెక్షన్ రూపంలో వచ్చిన సొమ్ముతో చెల్లిస్తుంది.

E.P.S.95 స్కీము ప్రవేశపెట్టిన తర్వాత 9 సంవత్సరాలకు 2004 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్దేశించి పాత పెన్షన్ స్థానే క్రొత్త పెన్షన్ స్కీము (N.P.C.) ప్రవేశ పెట్టినది. ఈ స్కీము E.P.S.95 స్కీము కంటే ఎన్నో రెట్లు అత్యధిక ప్రయోజనం ఉద్యోగులకు కలుగజేస్తున్నది. దీని ప్రకారం 2004వ సంవత్సరంలో ప్రవేశించిన ఉద్యోగి నెలవారీ కాంట్రిబ్యూషన్ 15 వేల రూపాయల చొప్పున స్కీముకు బదలాయిస్తే తన సర్వీసు 35 సంవత్సరాలకు పదవీవిరమణ నాటికి 63 లక్షలకు చేరుతుంది. దాని మీది 10% కాంపౌండు వడ్డీ లెక్క కడితే ఆ మొత్తము 5,74,24,151 రూపాయలకు చేరుకొంటుంది. దానికి అతి సాధారణ వడ్డీ 6% చొప్పున లెక్క కడితే అది రమారమి ఆ ఉద్యోగి పదవీవిరమణ కాలానికి 2,87,121 రూపాయలు పెన్షనుగా పొందగలడు. ఉద్యోగి మరణానంతరము నామినీకి 5,74,24,151 రూపాయలు పొందగలరు.

 4

E.P.S.95 స్కీము క్రింద ఉద్యోగి తనకు లభిస్తున్న చివరి వేతనంతో నిమిత్తం E.P.F.O. విధించిన పరిమితులకు లోబడి వున్న గరిష్ట పరిమితి 15,000 మీద నెలకు 8.33% కాంట్రిబ్యూషన్ 1250 రూపాయలు ప్రతి నెల స్కీముకు జమ అయితే పదవీవిరమణ కాలానికి 35 సంవత్సరాలకు 5,25,000/- అవుతుంది. అది 10% సగటు వడ్డీ లెక్కలోనికి తీసుకొంటే 47,85,346 అవుతుంది. ఆ సొమ్ము ఉద్యోగికి చెందదు. సంస్థ వద్దనే ఉండిపోతుంది. పెన్షను కూడా కేవలము 7,929 చెందుతుంది. (ఫార్ములా ప్రకారం = 15000 + 70 × 37 = 7929) NPC క్రింద ప్రభుత్వ ఉద్యోగి చెల్లించిన కాంట్రిబ్యూషన్లో E.P.S.95 పెన్షనరు 12వ వంతు చెల్లించాడు కాబట్టి ఈ ఉద్యోగికి నెలకు 23,927 పెన్షనుగా సంక్రమించాలి. (ప్రభుత్వఉద్యోగికి పదవీవిరమణ అనంతరము చెల్లించే పెన్షను 2,87,121లో 12 వ భాగం = 23,927/-) E.P.S.95 లో సర్వీసు కాలానికి చెల్లించిన మొత్తము 47,85,346 ఉద్యోగికి తిరిగిరాదు. నెలవారీ పెన్షనులో 33.13% మాత్రమే వస్తుంది. 7923/23,927 = 33.13%.

పాత పెన్షన్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమైన కాంట్రిబ్యూషన్ లేకుండా ఒక నిర్ణీత వ్యవధులలో వారికి Pay Scales మారిన ప్రతిసారి పెన్షనులో ఎదుగుదల ఉంటుంది. మరియు దానికి Cost of Living Index జత కలుస్తుంది. అయితే E.P.S.95 స్కీములో పెన్షనరుకు లభించే పెన్షనులో ఏమాత్రం ఎదుగుదలలేదు. సెప్టెంబరు 2014 లో 18 సంవత్సరాల తర్వాత కనీస పింఛను 1000 రూపాయలకు చేరింది. అదికూడా Super Annuation అయిన వారికి మాత్రమే (16-11-1995 To 31-08-2014).

ఆంధ్రప్రదేశ్ లో ఉచిత వృద్ధాప్య పెన్షను 16-11-1995 నాటికి 75 రూపాయలు ఉండగా 2004 సంవత్సరములో 200 రూపాయలకు పెరిగింది. ఆ తర్వాత 2014 సంవత్సరంలో శ్రీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో దానిని 5 రెట్లకు పెంచి 1000 రూపాయలుగా చేసారు. దానిని రెడింతలు పెంచి 2019 జనవరిలో 2000 రూపాయలుగా పెంచారు. కేరళ ప్రభుత్వం E.P.S.95 పెన్షనర్లకు నెలకు 600 రూపాయలు ఇస్తున్నది. ఎవరైతే E.P.S.95 పెన్షను 4000 రూపాయలు లోపు వస్తున్నవారికి.

ప్రస్తుత ఉద్యోగస్తుల పెన్షన్ విధానంలో E.P.S.95 పెన్షన్‌కు మరియు NPS పెన్షన్‌కు వున్న తారతమ్యం ఇది. మరియు పింఛను విధానములో ప్రైవేటు ఉద్యోగసులపట్ల చూపుతున్న వివక్ష ఇది. ఉద్యోగుల పెన్షన్ స్కీము (E.P.S.95) ప్రకారం కనీస పింఛను నిర్ధారించుటకు ఎటువంటి చట్ట పరమైన నిబంధనలు లేవని చెప్పి చట్టం మద్దతు ఇవ్వకపోవడం మంచిదా? Living Cost Index తో Link చేయకూడదని సూచించిన ఫార్ములాకు పెన్షన్ స్కీమును పరిమితం చేస్తూ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకొనడంలో గల ఆంతర్యం ఏమిటి? దేశాభివృద్దిలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగుల సమాన భాగస్వామ్యం

       5

వున్నది. అటువంటప్పుడు ఈ రెండింటి పెన్షన్ స్కీముల మధ్య ఇంత తారతమ్యం ఎందుకు ఉండాలి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు.

దేశంలో కనీస పెన్షను పెంపు కోసం నిరీక్షిస్తూ 70 సంవత్సరాలు ఆపైబడిన వృద్ధులు హయ్యర్అప్షన్ కు నోచుకోనివారు మొత్తం పెన్షనర్లలో 80 శాతం మంది వున్నారు. వారు కనీస పింఛను 7500 మరియు D.A.తో కలిపి ఇవ్వవలసినదిగా దాదాపు సంవత్సరాలుగా ప్రభుత్వానికి తమ నిరసన 5 తెలియచేయుచున్నారు. ద్వారా

ప్రభుత్వం E.P.S.95 వ్యవస్థను సమూలంగా సరిదిద్దాలి లేదా న్యాయవ్యవస్థ కలుగచేసుకొని రాజ్యాంగ విలువలను సంరక్షించే విధంగా ప్రాధమికహక్కులకు భంగం వాటిల్లకుండా సంఘములో గౌరవప్రదంగా జీవించడానికి వారికి సాంఘిక మరియు ఆర్ధిక భద్రత కల్పించవలసిన అవసరం ఎంతయినా వున్నది.

భవదీయుడు కొల్లిపర శ్రీనివాసరావు Mobile: 9573198333