EPS 95 Pensioner | NAC | దయచేసి ఈ ఆర్టికల్ ని చివరి వరకు చదవాలి

EPS 95 Pensioner దయచేసి ఈ ఆర్టికల్ ని చివరి వరకు చదవాలి అని మనవి.

EPS 95 Pensioner | NAC | దయచేసి ఈ ఆర్టికల్ ని చివరి వరకు చదవాలి

EPS 95 Pensioner:

2013 సంవత్సరంలో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీజేపీ నాయకుడు శ్రీ ప్రకాష్ జావదేకర్, EPS 95  పెన్షనర్ల బాధ మరియు పేదరికం గురించి చాలా సార్లు మాట్లాడారు.  వీరిలో అత్యధికులు 200 లేదా 300 వరకు  తక్కువ  పెన్షన్ తో సతమతమవుతున్నారు. మినిమమ్ పెన్షన్  3000 రూపాయలు [ప్లస్ DA తో] కనీస  పెన్షన్ ను ఇవ్వాలని  అప్పటి యుపిఎ ప్రభుత్వాన్ని ఆయన సరిగానే డిమాండ్ చేశారు.
పెన్షన్ అనేది ఒక దానం కాదని మరియు అది ఒక పెన్షనర్ల హక్కు అని పేర్కొంటూ, 3 దశాబ్దాలకు పైగా వారి మొత్తం సేవా కాలం లో కష్టపడి సంపాదించిన సొమ్ము అని అన్నారు.
అదేవిధంగా, ఆయన “ Penson must be indexed to inflation” అని వాదించారు.  
ప్రతినెలా, ఉద్యోగుల తరపున యజమాన్యం 8.33% EPFO ఆఫీసు లో  జమ చేసిన మొత్తములో నుంచి  ఈ పెన్షన్ ఇస్తున్నారని, ప్రభుత్వం వుచితంగా ఇవ్వడం లేదని  ఆయన  ఘాటుగా విమర్శించారు.
 యూపీఏ ప్రభుత్వం ఈ డిమాండ్ కు లొంగలేదు…
అయితే, ఈ సానుభూతి పదాల ద్వారా సమ్మోహనం పొంది, పెన్షనర్లందరూ సంపూర్ణ మెజారిటీతోనే అధికారాన్ని బీజేపీకి ఓటు వేశారు…
శ్రీ ప్రకాష్ జావదేకర్ కూడా ఎన్నికలలో గెలిచి కేంద్ర ప్రభుత్వంలో మినిస్టీరియల్ స్థానాన్ని బహుమతిగా పొందాడు…
అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి ప్రభుత్వం, దాని నాయకులు పెన్షనర్ల దుస్థితిని మర్చిపోయి, సుదీర్ఘ పోరాటం చేసినప్పటికీ, సీనియర్ పౌరుల సమస్యలను తగ్గించడానికి ఎలాంటి చర్యలు ప్రారంభించారు..
వారు 2015 సంవత్సరం సుమారుగా రూ. 1000/-వరకు కనీస పెన్షన్ మాత్రమే అమలు చేశారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం చివరి పీరియడ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటి ప్రభుత్వము పెన్షన్ పెంపుపై  ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అదే గత ప్రభుత్వము నిర్ణయించిన పెన్షన్ ను ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు.

1] NAC: National Agitation Committee నాయకులు ప్రధాన మంత్రిని కలుసుకొని, ఈ సమస్యపై ఆయనను ఇంప్రెస్ చేయాలని, అప్పటి వీడియో ను ఆయన దృష్టికి తీసుకు వెళ్లాలని ,  పెన్షనర్ల న్యాయబద్ధంగా ఉన్న డిమాండ్లను తెలియపరచి, న్యాయసమ్మతమైన పెంషను ఏర్పాటు చేయించాలని, ఈ కార్యక్రమం కోవిడ్-19 తదుపరి వేగవంతం చేయాలని మనవి.

2] అలాగే, National Agitation Committee నాయకులు, శ్రీ ప్రకాష్ జావదేకర్, ప్రస్తుత పర్యావరణ శాఖ మంత్రి, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ మరియు పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ లను కలవాలని మరియు తన ప్రసంగం యొక్క వీడియోతో ఆయనను ప్రశంసించి, పెన్షనర్ల న్యాయబద్ధంగా ఉన్న డిమాండ్లను తెలియపరచి, న్యాయసమ్మతమైన పెంషను ఏర్పాటు చేయించాలని అభ్యర్థించారు…..

3] ఇటీవల కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయలలో, eps 95 pensioners కు ఎటువంటి ఆర్ధిక సహాయం చేయలేదని తెలియవస్తోంది. కోవిడ్-19 పీరియడ్ లో అడిగిన మద్యంతర ఆర్ధిక సహాయానికి కేంద్రం మొండి చేయి చూపినట్లేనని రూఢి అయినది. 

ఆయన విమర్శించిన వీడియో [Hindi] లింకు ను ఇక్కడ ఇస్తున్నాను.


For English Article of this Page, pl press this English link