Important Message by an EPS 95 Higher Pension Optee

Message by VS Murthy, on higher Pension. .

గౌరవ సభ్యులకు సహచర విశ్రాంత ఉద్యోగులకు, నమస్కారములు.

నిన్న నా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగా, పెన్షన్ ని ఏ విధంగా, ఏ పద్ధతిపై లెక్కించారు అనే విషయంపై ఒక పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ వైరల్ కూడా అయినది.

అయితే నా వివరణ పై అనేక మందికి సందేహాలు అనుమానాలు తలెత్తి నాకు ఫోన్లు చేశారు. చెప్పాలంటే నాకు నిన్న రోజంతా ఫోన్లు ఆన్సర్ చేయడంలోనే గడిచిపోయింది. నేను ప్రస్తుతం మా పిల్లల దగ్గర బెంగళూరులో ఉంటున్నాను.

అంతేకాక, ఫోన్లు ఆన్సర్ చేయలేని పరిస్థితి కూడా ఉన్నది. అయినా నాకు వీలైనంత మేరకు చాలామందికి ఫోన్ ఆన్సర్ చేయడం జరిగింది. అన్ని ఫోన్లు ఆన్సర్ చేయడం చాలా కష్టతరమైన విషయం..

ఫోన్లు ఆన్సర్ చేయ(లేకపోయి)నందుకు కొంతమంది హర్ట్ కూడా అయి ఉండవచ్చు. అందువలన ఈరోజు పూర్తిగా తెలుగులో మరింత సోదాహరణంగా నా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ విషయమై చెప్పదలిచాను.

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

నేను గత అక్టోబర్ 13 వ తారీకు న ₹26,33,885 రూపాయలు, పీఎఫ్ ఆఫీస్ వారికి జమ చేశాను. సుమారు నాలుగు నెలలు దాటిన తర్వాత, ఒకటో తారీకు న నాకు పాత పెన్షన్ (₹2854/-) జమ అయినది. శ్రీ ఎన్ వి ఎల్ ఎన్ మూర్తి గారు నా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ రెండవ తారీకు ఉదయం పంపించారు.

అంతవరకు నాకు కొత్త పెన్షన్ గురించి సమాచారం లేదు. తరువాత నేను ఈపీఎఫ్వో వెబ్సైట్ కి వెళ్లి, నా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేశాను. అది ఈరోజు కూడా వెబ్ సైట్ లో ఉన్నది. ఈ ఎన్ఎండి లో పనిచేసిన ప్రసాద రాజు గారికి కొత్త పెన్షన్ క్రెడిట్ అయి తరువాత వెంటనే డెబిట్ అయినది ఆయన బ్యాంక్ అకౌంట్లో. నాకు కొత్త పెన్షన్ క్రెడిట్ అవ్వడమే జరగలేదు.

పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లో ఉన్న సమాచారాన్ని బట్టి పెన్షన్ ఏ విధంగా లెక్కించారో అవగాహన చేసుకోవడం జరిగింది. నా పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో డేటాఫ్ ఎగ్జిట్ నాటికి నా జీతం ₹38,614 అని రాశారు. పొరపాటు జరిగిందేమో అని తొలుత గా భావించాను.

కానీ కాస్త లోతుగా పరిశీలించిన తర్వాత అందులో లోపం లేదని తెలిసింది. ఎలా అంటే, ఈపీఎస్ పెన్షన్ విషయంలో నా రిటైర్మెంట్ 9.8.2016. ఆ నెల జీతం ₹1,33,004. ఆ నెల తొమ్మిదో తారీఖు వరకు జీతం ₹38,614 మాత్రమే తీసుకున్నారు.

ఇక, పెన్షన్ లెక్కింపు గురించి: ఈపీఎఫ్ఓ హెడ్ ఆఫీస్ వాళ్లు సర్క్యులేట్ చేసిన ఫార్ములా ప్రకారం

2014 తర్వాత 58 సంవత్సరములు పూర్తయిన వారికి, దిగువ ఉదహరించిన ఫార్ములా వర్తింపచేసేటట్టుగా ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం,

  1. 2014 సంవత్సరంలో, సెప్టెంబర్ నెల ముందు ఏ నెలలో అయితే జీతం ఎక్కువగా వచ్చిందో ఆ జీతాన్ని X అనుకోండి. నాకు ఇది ₹1,09,000 పై చిలుకు. అంతేగాని కొందరు అభిప్రాయ పడినట్లుగా, 2014 నుండి వెనుకకు 60 నెలల సరాసరి కాదు.
  2. 58వ సంవత్సరం ప్రవేశించిన దగ్గర నుండి 60 నెలలు వెనుకకు వెళ్లి ఆ శాలరీని లెక్కించి ఆ మొత్తాన్ని 60 చేత భాగిస్తే వచ్చే మొత్తము, 60 నెలల సరాసరి అవుతుంది. దానిని Y అనుకోండి.
  3. కొత్త ఫార్ములా ప్రకారం, పెన్షనబుల్ ఇన్కమ్ రెండు విధాలుగా ఉంటుంది. మొదటిది 16.11.95 నుండి 31.8.2014 వరకు ఒక పెన్షన్. ఇది పార్ట్ A పెన్షన్.
  4. 1.9.2014 నుండి 58 వ సంవత్సరం వచ్చినంత వరకు, అంటే మన పుట్టిన తేదీ వరకు ఒక పెన్షన్. ఇది పార్ట్ B పెన్షన్.

పైన ఇచ్చిన X, Y మొత్తాలు ఈ పార్ట్ A, పార్ట్ B పెన్షన్లు లెక్కించడానికి ఉపయోగపడతాయి.

  1. ఈ X, Y మొత్తాల్లో ఏది తక్కువ ఉంటే, ఆ తక్కువ మొత్తాన్ని తీసుకుని దానిని 16 11 95 నుండి 31 8 2014 వరకు రావలసిన పెన్షన్ మొత్తాన్ని ఫార్ములా ప్రకారం లెక్కిస్తారు. ఫార్ములా అందరికీ తెలుసు. పెన్షనబుల్ ఇన్కమ్ ను పెన్షనబుల్ సర్వీస్ తో గుణించి 70 అనే సంఖ్యతో భాగిస్తారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటంటే సంవత్సరాలను రోజుల్లోకి తర్జుమా చేస్తారు. ఈ పెన్షనబుల్ సర్వీసు, 95 కంటే ముందర జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ ఒకే విధంగా ఉంటుంది. అది 6856 రోజులు. ఈ ఫార్ములా ప్రకారం వచ్చిన మొత్తాన్ని పార్ట్ A పెన్షన్ గా అనుకోండి.

నా విషయంలో, 2014లో మ్యాగ్జిమం శాలరీ, డేట్ ఆఫ్ ఎగ్జిట్ నుండి వెనుకకు 60 నెలసరి శాలరీ లలో, 60 నెలల సరాసరి శాలరీ తక్కువ ఉన్నది. అది ₹1,04,836/-. అందుచేత నా పెన్షనబుల్ ఇన్కమ్ మొత్తం సర్వీస్ అంతటికి ఇదే ఉంటుంది.

ఇప్పుడు లెక్కింపు ఎలా అంటే, 6856 x 104836 ÷ 25550 = ₹28131/- (PART A)
(25550 = 70 x 365)

  1. ఇక 1 9 2014 తర్వాత సర్వీస్ కి సంబంధించిన పెన్షన్ లెక్కించే పద్ధతి. దీనికి 60 నెలల సరాసరి జీతం మీరు 58 సంవత్సరాలు కంప్లీట్ చేసిన రోజు నుండి వెనుకకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. అది 2014 తర్వాత సర్వీస్ కి సంబంధించిన పెన్షనబుల్ ఇన్కమ్. ఇది పార్ట్ B పెన్షన్.

నా పెన్షన్ విషయంలో అయితే, నేను 9 8 2016 న ఈపిఎస్ 95 మెంబర్షిప్ నుంచి ఎగ్జిట్ అయ్యాను. 1.9.2014 నుండి 9.8.2016 వరకు 708 రోజులు. 60 నెలల సరాసరి జీతం ₹1,04,836/-. ఈ పెన్షనబుల్ ఇన్కమ్ పై, ఫార్ములా ప్రకారం, పెన్షన్

708 x 104836 ÷ 25550 = ₹2905/- (PART B)

3) నవంబర్ 95 తర్వాత నేను 20 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేశాను కాబట్టి నాకు బోనస్ రెండు సంవత్సరాలు సూత్రం వర్తిస్తుంది. ఈ బోనస్ పెన్షన్ మాత్రం 2014 మందు సర్వీస్ కి ఏ పెన్షన్ల్ ఇన్కమ్ ని తీసుకున్నారో ఆ పెన్షన్ బుల్ ఇన్కమ్ పైనే లెక్కిస్తారు. ఇలా, రెండు సంవత్సరాల అంటే 730 రోజులు పై పెన్షన్:

730 x 104836 ÷ 25550 = ₹2995/- (PART C)

PART A + PART B + PART C

₹28131.33+2905.31+2995.04 = 34031.68 + 654 = ₹34685.68
Rounded to ₹34686/-

అక్షరాలా ఈ పెన్షన్ నాకు శాంక్షన్ అయింది.

ఇక్కడ ఒక విషయం గమనించదగినది. నా విషయంలో అయితే, పెన్షనబుల్ ఇన్కమ్ 2014కి ముందు 2014 తర్వాత ఒకటే ఉన్నది. సాధారణంగా 2014 తర్వాత తక్కువ సర్వీస్ ఉన్నవాళ్లకి ఇలా జరగడానికి అవకాశం ఉన్నది.

ఎందుకంటే 60 నెలల సరాసరి శాలరీ, 2011 వరకు వెళుతుంది కాబట్టి. కానీ 2014 తర్వాత ఐదు సంవత్సరాలు తర్వాత 58 సంవత్సరాలు నిండితే వారికి ఇటువంటి పరిస్థితి ఉండకపోవడానికి అవకాశం ఉన్నది. కారణం , 2014లోని మాక్సిమం శాలరీ కంటే, 60 నెలల యావరేజ్ శాలరీ ఎక్కువగా ఉంటుంది. నా కేసులో మాత్రం 2014 శాలరీ ఎక్కువ ఉన్నది.

ఓల్డ్ పెన్షన్ శాంక్షన్ అయిన వాళ్ళకి, పాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో, పార్ట్ ఏ పార్ట్ బి సర్వీస్ పీరియడ్ రోజుల్లో చూపించారు. అది చూసి కూడా చాలా సులువుగా పెన్షన్ లెక్కించుకోవచ్చు.

ఇప్పుడు అరియర్స్, పెన్షన్ క్రెడిట్ విషయానికొద్దాం.

ఈ ఎన్ ఎండి లో రిటైర్ అయిన ప్రసాద రాజు గారికి, లాస్ట్ మంత్ హయ్యర్ పెన్షన్ మార్చి 1న క్రెడిట్ అయిన తర్వాత వెంటనే డెబిట్ చేసేసారు.

నా విషయంలో అది కూడా జరగలేదు నాకు ఒకటో తారీకు రాత్రి పాత పెన్షన్ మాత్రమే క్రెడిట్ చేశారు. అయితే ఈ పోస్ట్ పెట్టే సమయానికి కూడా నా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ని అలాగే ఉంచారు. పెన్షన్ పేమెంట్ జనరేట్ అయిపోయింది. పీపీఓ నంబర్ కూడా మారిపోయింది. ప్రసాద్ రాజు గారికి ఇంకా ఎవరికైనా ఆర్డర్స్ వస్తే వారి ఆర్డర్స్ లో కూడా ఎటువంటి మార్పు ఉండదనే భావించాలి.

నా పీపీఓలో ఆంధ్రాబ్యాంక్ అని ఉంది కదా ఆంధ్ర బ్యాంకు ఇప్పుడు లేదు కదా, అది కరెక్ట్ ఆర్డర్ కాదు అని కొంతమంది అభిప్రాయం. వారికి తెలియని విషయం ఏంటంటే నా పాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లో కూడా ఆంధ్రాబ్యాంక్ మాత్రమే కంటిన్యూ అవుతున్నది. అలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. బ్యాంకు పేరు మాత్రమే మారింది అకౌంట్ నంబరు మారలేదు. అందునా, ఆ ఆర్డర్ పిఎఫ్ సైట్ నుండి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసినది. దానిలో ఎటువంటి సందేహాలకు తావులేదు.

అంతేకాక, ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో పెన్షన్ స్టేటస్ గురించి చూస్తే, మీ పెన్షన్ నంబర్ మారింది, కొత్త నంబర్ ని సూచిస్తూ ఆ నెంబర్తో సెర్చ్ చేయమని పాప్ అప్ వచ్చింది. కాబట్టి వచ్చే నెల లో అయినా, కొత్త పెన్షన్ క్రెడిట్ అవ్వడానికి అవకాశం ఉందని భావిస్తున్నాను. అలాగే అరియర్స్ కూడా. రాకపోతే, అప్పుడు చూడొచ్చు. ఇప్పటినుండి ఆదుర్దా చెందవలసిన అవసరం లేదు.

ఇంత వివరంగా పై పోస్టు పెట్టడానికి కారణం, వ్యక్తిగతంగా ఫోన్ కాల్స్ అటెండ్ అవ్వలేని పరిస్థితి నాది. అయినా నాకు వీలు కలిగినంత మేరకు చాలామంది కాల్స్ ఆన్సర్ చేయడం జరిగింది. ఎవరికైనా కాల్స్ ఆన్సర్ చేయకపోతే, అన్యధా భావించవలదని మనవి.

2014 తర్వాత ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసిన వాళ్ళకి, అంటే 2019, 20 ఆ తర్వాత రిటైర్ అయిన వాళ్లకి ఈ ఫార్ములా కొంత నష్టం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. అది వేరే అంశం.

పై పోస్టుని పూర్తిగాచదివినట్లయితే ఎటువంటి సందేహాలు రావడానికి అవకాశం లేదు. నా అవగాహన మేరకు, సాధ్యమైనంతవరకు స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నించాను. సందేహాలు వచ్చిన వారందరికీ పెన్షన్ లెక్కింపు పై వివరణ ఇవ్వడం కష్టమని గ్రహించ ప్రార్థన.

V.S.Murthy