Reduction of interest on the Higher pension optees dues

Please press the Text here to read in English and Hindi

ఎవరైతే ఈపీఎస్ 95 పెంచినర్లు అధిక పెన్షన్ అర్హులో వారికి ఈపీఎఫ్ఓ ఈ విధంగా ఊరుట నిచ్చింది.
ఉద్యోగుల పెన్షన్ పథకం ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ లో జమ చేయవలసిన బకాయిలపై వడ్డీ భారాన్ని తగ్గించింది.

ఇదివరకు కట్టవలసిన బకాయిలను 24% వడ్డీతో కట్టాలని నోటీసులు ఇవ్వడం జరిగినది కానీ దానిని ఇప్పుడు 8 శాతానికి తగ్గించింది.

ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఈపీఎఫ్ ఖాతాలో నిలువలపై చెల్లిస్తున్న వడ్డీ రేటు లాగానే ఇప్పుడు ఈ వడ్డీ రేటు నిర్ణయించడం జరిగినది.

డిమాండ్ నోటీసులో పేర్కొన్న గడువులోగా బకాయిలు చెల్లించాలని, లేకుంటే అధిక పెన్షన్ పై ఆసక్తి లేదని భావిస్తూ దరఖాస్తులు తిరగిరస్కరిస్తామని తెలియజేసింది.

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

Some Examples for the highe rate of interest:

హైదరాబాద్ కు చెందిన ఉద్యోగి ప్రభుత్వరంగ సంస్థలో పనిచేస్తూ అత్యున్నత పదవిలో పదవి విరమణ చేశారు. ఈపీఎఫ్ఓ కు హయ్యర్ పెన్షన్ దరఖాస్తు చేయగా ఆమోదం లభించింది.

దరఖాస్తు ఆమోదం లభించిన రోజు 2023 మే 31 నాటికి ఉద్యోగుల పెన్షన్ పథకము బకాయి 17,69,290 రూపాయలు గా ఈపీఎఫ్ఓ లెక్క కట్టినది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఈపీఎఫ్ మూడు నెలల గడువు ఇచ్చింది. ఇందులోని మొదటి నెలలో చెల్లిస్తే సంవత్సరానికి 24 శాతం వడ్డీ చొప్పున18,04,856 రూపాయలు చెల్లించాలి.

రెండో నెలలో అయితే 18,52,278 రూపాయలు,
మూడో నెలలో అయితే 19,11,555 రూపాయలు చెల్లించాలి అని ఈపీఎఫ్ఓ ఆయనకు నోటీసు పంపించింది.

ఈ రకంగా మూడు నెలలో అయితే సుమారు 32 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇది ఎక్కువగా ఉందని తీవ్ర విమర్శలు రావడంతో దానిని ఈపీఎఫ్ఓ 8% కు తగ్గించింది.

The present interest rate:

ఓ ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి అధిక పింఛన్ కోసం చేసిన దరఖాస్తు జూన్ 16వ తేదీన ఆమోదం పొందినది.
అందుతున్న వాస్తవిక అధిక వేతనంపై ఈపీఎస్ కు చెల్లించాల్సిన బకాయిలను వడ్డీ సహా (2014 సెప్టెంబర్ 1వ తేదీ వరకు 8.33 శాతం వడ్డీ, సెప్టెంబర్ 1 తర్వాత సర్వీసుకు 8.33 శాతంతో పాటు అదనంగా 1.16 శాతం కలిపి) లెక్కించింది.

జూలై 31 లోగా చెల్లిస్తే 8,47,497 రూపాయలు,
రెండో నెలలో ఆగస్టు 31 లోగా చెల్లిస్తే 8 శాతం వడ్డీ చొప్పున 8,53,100 రూపాయలు
మూడో నెలలో సెప్టెంబర్ 31 తేదీల్లోగా చెల్లిస్తే 8,58,704 రూపాయలు కట్టాలని సూచించింది.

ఇలా తాజాగా జారీ చేస్తున్న డిమాండ్ నోటీసుల్లో వడ్డీ భారాన్ని ఏడాదికి 24 నుంచి 8% తగ్గించింది.

Agree to the transfer of funds once again:

ఈపీఎస్ డిమాండ్ నోటీసు మేరకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఉద్యోగుల భవిష్యనిది ఖాతా నుంచి మళ్లించేందుకు దరఖాస్తుదారులు ఇప్పటికే ఆన్లైన్ లో అంగీకారం తెలిపారు.
అయితే దాని ప్రకారం నేరుగా నిధులు బదిలీ చేయకుండా డిమాండ్ నోటీసు జారీ చేసిన తర్వాత మరోసారి అంగీకారం చెప్పాలని ఈపీఎఫ్ఓ సూచిస్తుంది.
బహుశా ఇది ఖాతాలో తగినన్ని నిధులుంటే ఉద్యోగ అంగీకారంతో వాటిని ఈపీఎస్ కు మళ్ళి ఇస్తారు. నిధులు లేకుంటే స్థానిక ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేసిన ఆన్లైన్ వ్యవస్థ లేదా ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ పేరిట తీసి పంపించాలి.
నిర్ణీత గడువు తేదీలోగా ఈపీఎస్ బకాయిలు చెల్లించాలని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది.
గడువులోగా బకాయిలు చెల్లించకుంటే దరఖాస్తుపై పిఎఫ్ Commssioner తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించింది