Removing the obstacles in the implementation of EPF 95 Higher Pension

ప్రసార / ప్రచురణ నిమిత్తం :
TSRTC కార్మికులకు హయ్యర్ పెన్షన్ పొందే విషయం లో PF కార్యాలయం లో జరుగుతున్న వివక్షను సరిచేసి న్యాయం చేయాలని, RTC నుండి RTC PF ట్రస్ట్ కు చెల్లించాలిసిన 1450 కోట్లు చెల్లించి హయ్యర్ పెన్షన్ కు ఉన్న ఆటంకాలను సరిచేసి PF కార్యాలయం నుండి డిమాండ్ నోటీసు లు ఇప్పించాలని కోరుతూ శనివారం నాడు రవాణా మంత్రి గారి కార్యాలయం లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పూర్తి పాఠాన్ని దిగువన ఇస్తున్నాము. దీనిని పృచురించి సహకరించాలని కోరుతున్నాము.
VSRAO, GS-TSRTC SWF


టి.ఎస్. ఆర్.టి.సి స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటి
తేదీ : 24.02.2024

శ్రీయుత గౌ॥ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, రవాణ మరియు బిసి సంక్షేమ శాఖామంత్రివర్యులు, బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్.

విషయం : హయ్యర్ పెన్షన్ ఆర్టీసి కార్మికులకు పి.ఎఫ్ హయ్యర్ పెన్షన్ అమలులో వస్తున్న ఆటంకాలు తొలగించి, డిమాండ్ నోటీసులు అందేలా చూడవలసిందిగా కోరుట గురించి…

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

సూచిక : (1) సుప్రీమ్ కోర్ట్ఉన్న ఆటంకాలను సరిచేసి, తీర్పు తేదీ: 04.11.2022.

(2) EPFO ​​ సర్కులర్ no . పెన్షన్ / POHW/23/సర్క్యులర్ – 26(6) / 139610 Dt.14.06.2023.

(3) CPIO కేసు నెం. 279 of 2023-24. RTI ద్వారా పొందిన సమాచారం.

XXX

భారతదేశ కార్మికవర్గం చేసిన ఆందోళనలు, న్యాయపోరాటం ఫలితంగా కార్మికులు తమకు హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్ ఇచ్చుకొనేందుకు అనుమతినిస్తూ సూచిక (1) లో తెలిపిన తీర్పును సుప్రీం కోర్టు ఇచ్చింది. ఈ తీర్పును అమలు చేయడానికి

35/2022/54877/15149 SC T F, s. 29. 12. 2022; 25/2022/54877/15238, 2. 5.1.2023;
పెన్షన్ / 2022/56259/16541, తేది. 2022-2023. పెన్షన్ / సుప్రీంకోర్టు/ జడ్జిమెంటు/ హెచ్.పి.ఎం/2022/406, తేది. 23.04.2023 సర్క్యులర్స్ ను విడుదల చేసింది. వీటి ఆధారంగా దేశ కార్మికవర్గంతో పాటుTS ఆర్టీసి కార్మికులు (సర్వీసులో వున్న వారు, విశ్రాంత ఉద్యోగులు) కూడా హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేసుకొన్నారు.అయితే దాని అమలులో వున్న కొన్ని అడ్డంకులను తొలగించేందుకు సూచిక (2)లో తెలిపిన సర్క్యులర్ ను భవిష్య నిధి సంస్థ విడుదల చేసింది.

టిఎస్ ఆర్టీసి కార్మికులు పెట్టుకొన్న అప్లికేషన్స్ అన్నింటిని టిఎస్ ఆర్టీస్ పి.ఎఫ్ ట్రస్ట్ పరిశీలన చేసి 2023 ఏప్రిల్‌లోనే రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్, బర్కత్‌పుర, హైదరాబాద్ వారికి పంపించారు. దాదాపు 10 నెలల సమయం గడిచినప్పటికి టిఎస్ ఆర్టీసి కార్మికులకు డిమాండు నోటీసులు అందనందున, ఆర్.టి.ఐ ద్వారా సమాచారం కోసం ప్రయత్నించారు. సూచిక -3 లో తెలిపిన సమాచారాన్ని ఆర్.పి.ఎఫ్.సి బర్కత్‌పురా వారు ఇచ్చారు.

ఈ సమాచారం ప్రకారం ఎ.పి./ హైదరాబాద్/ 0000295- పి.ఎఫ్ కోడ్ తో ఎ.పి., తెలంగాణ ఆర్టీసి లకు ఉమ్మడి ట్రస్ట్ గానే కొనసాగుతున్నది. రెండు ఆర్టీసిలలో కలిపి 98,732 మంది హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేసుకొన్నారని, 15.12.2023 నాటికి మొత్తం 11,733 మందికి ఆర్.పి.ఎఫ్.సి నుండి డిమాండు నోటీసులు అందాయని సమాచారం అందించారు. అయితే ఆ సమయానికి టిఎస్ ఆర్టీసిలో కేవలం 125 మందికి మాత్రమే డిమాండు నోటీసులు అందాయి. అంటే ఆంధ్రప్రదేశ్ లో 11,608 మంది డిమాండ్ నోటీసులు అందుకుంటే మన ఆర్టీసి కార్మికులు కేవలం 125 మందే అందుకున్నారు. ఈ వినతిపత్రం తమకు అందించే నాటికి సుమారు 14,000 మందికిపైగా ఎ.పి. లో డిమాండు నోటీసులు అందుకోగా, మన ఆర్టీసిలో మాత్రం పాత 125 మందికి తప్ప ఒక్కరికి కూడా డిమాండ్ నోటీసులు అందక తీవ్రంగా నష్టపోతున్నారు.ఈ పరిస్థితికి కారణం ఏమిటి అని పరిశీలించినప్పుడు, టిఎస్ ఆర్టీసి యాజమాన్యం పి ఎఫ్ ట్రస్ట్ కు జమ చేయాల్సిన 1450 కోట్ల రూపాయలు చెల్లించకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని పరిశీలనలో అర్ధం అయింది. సూచిక 2లో తెలిపిన సర్క్యులర్‌లోని పేరా నెం.6 ను టిఎస్ ఆర్టీసి పిఎఫ్ ట్రస్ట్ పూర్తి చేయలేదు. కార్మికులకు ప్రతి సం॥ మార్చిలో జనరేట్ చేస్తున్న పి.ఎఫ్ స్లిప్స్ అన్ని కూడా బుక్ అడ్జస్ట్మెంటు చేసి కార్మికులకు ఇచ్చినవే తప్ప, నిజంగా ఆ డబ్బులు వారి ఒరిజనల్ ఖాతాల్లో (పి.ఎఫ్ ట్రస్ట్‌లో) జమ కాలేదు. కార్మికులు / యజమాని వాటా తో కలిపి 1450 కోట్లు ఆర్టీసి యాజమాన్యం వాడుకొన్న డబ్బులు నిర్దేశించిన వడ్డీతో పి.ఎఫ్ ట్రస్ట్ లో జమ చేయకపోతే ఆర్టీసి కార్మికులు హయ్యర్ పెన్షన్ కోసం డిమాండ్ నోటీసులు అందే అవకాశం కనిపించడం లేదు.

పెన్షన్ పెంపుదల కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్నాం. ‘గుడ్డి కంటే మెల్ల’ మేలన్నట్లు కొంత డబ్బు పి.ఎఫ్ కు చెల్లించాల్సి వచ్చినా, హయ్యర్ పెన్షన్ పొందేటట్లయితే సర్వీసు నుండి రిటైరైన తర్వాత గౌరవంగా, ఒకరిపై ఆధారపడకుండా బ్రతకవచ్చు అని ఆశిస్తున్నాం. కానీ ట్రస్టుకు చెల్లించాల్సిన డబ్బులు ఆర్టీసి సంస్థ వాడుకున్నవి తిరిగి చెల్లించనందున సుమారు 42 వేల ఆర్టీసి కుటుంబాలు భవిష్యత్ అంధకారమయ్యే పరిస్థితి ఏర్పడింది.

కావున, తమరు ఈ సమస్యపై జోక్యం చేసుకొని, పి.ఎఫ్ ట్రస్ట్‌కు ఆర్టీసి యాజమాన్యం చెల్లించాల్సిన 1450 కోట్లు వడ్డీతో చెల్లించేలా చూసి, మా కార్మిక కుటుంబాల భవిష్యత్ జీవితం అంధకారం కాకుండా కాపాడవలసిందిగా కోరుతున్నాము. అలాగే ప్రావిడెంట్ ఫండ్ తెలంగాణ ప్రాంతీయ కమిటీ చైర్మన్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కార్మికశాఖ వారి దృష్టికి సమస్యను తీసుకెళ్ళి ఆర్.పి.ఎఫ్.సి., బర్కత్‌పురాలో తెలంగాణ ఆర్టీసి కార్మికులపై జరుగుతున్న వివక్షను రూపుమాపి వెంటనే అర్హత కలిగిన కార్మికులు అందరికి హయ్యర్ పెన్షన్ కోసం డిమాండ్ నోటీసులు వచ్చేలా చూడవలసిందిగా తమకు మనవి చేసుకుంటున్నాము.

ధన్యవాదములతో…

(వీరాంజనేయులు)అధ్యక్షులు.
(వి.యస్.రావు) ప్రధాన కార్యదర్శి.

ENGLISH

Translated from the Telugu version.

Please refer to the Telugu version for any clarity

For Broadcast / Publication :

 A petition was filed in the Transport Minister’s office on Saturday seeking to rectify the discrimination in the PF office in the matter of getting higher pension for the TSRTC workers, to pay 1450 crores from the RTC to the RTC PF Trust and to rectify the obstacles to the higher pension and to issue demand notices from the PF office.  .  Full text is given below.  Please publish it and contribute.

 VSRAO, GS-TSRTC SWF

 **********************

 *T.S.  RTC Staff & Workers Federation State Committee*

 Date : 24.02.2024

 * Mr. Gou  To Ponnam Prabhakar Goud, Ministers of Ravana and BC Welfare, BR Ambedkar Secretariat, Telangana State, Hyderabad.*

 *Subject : Regarding the request to remove the obstacles in the implementation of PF Higher Pension to RTC workers and ensure that they receive demand notices…*

 Index : (1) Supreme Court rectifies existing impediments, Judgment date: 04.11.2022.

 (2) EPFO ​​circular no.  Pension / POHW/23/Circular – 26(6) / 139610 Dt.14.06.2023.

 (3) CPIO Case no.  279 of 2023-24.  Information obtained through RTI.

 XXX

 As a result of the agitations and legal battles of the working class of India, the Supreme Court has given the judgment mentioned in index (1) allowing the workers to give themselves an option for a higher pension.  To enforce this judgment

 35/2022/54877/15149 SC T F, s.  29. 12. 2022;  25/2022/54877/15238, 2. 5.1.2023;

 Pension / 2022/56259/16541, dt.  2022-2023.  Pension / Supreme Court / Judgment / HPM/2022/406, dt.  23.04.2023 released circulars.  Based on these, TS RTC workers (those in service and retired employees) have also applied for higher pension along with the working class of the country. However, to remove some obstacles in its implementation, the circular mentioned in index (2) has been released by Bhavisya Nidhi.

All the applications submitted by the TS RTC workers were examined by the TS RTS PF Trust and sent to the Regional Provident Fund Commissioner, Barkatpura, Hyderabad in April 2023.  After nearly 10 months, the TS RTC workers did not receive the demand notices, so they tried to get the information through RTI.  RPFC Barkatpura gave the information given in Index-3.

 According to this information, A.P./Hyderabad/ 0000295- with PF code is continuing as a joint trust for A.P., Telangana RTCs.  It was informed that a total of 98,732 people have applied for higher pension in both RTCs and a total of 11,733 people have received demand notices from RPFC as on 15.12.2023.  But by that time only 125 people in TSRTC received demand notices.  This means that in Andhra Pradesh, 11,608 people have received demand notices, but our RTC workers have received only 125.  By the time this petition was presented to them, more than 14,000 people from A.P.  While receiving the demand notices, in our RTC, except for the old 125 people, none of them have received the demand notices. When we examined the reason for this situation, it was understood that this situation arose because the management of TSRTC did not pay 1450 crore rupees to be deposited to the PF Trust.  TS RTC PF Trust has not completed paragraph no.6 of the circular mentioned in index 2.  Every year for workers  All the PF slips being generated in March were book adjusted and given to the workers, but actually the money was not deposited in their original accounts (in PF Trust).  1450 crores including workers/employer’s share is not deposited in the PF Trust with interest prescribed by the management of RTC, there is no possibility that the RTC workers will receive demand notices for higher pension.

We have been waiting for decades for the increase in pension.  Even if we have to pay some money to PF as it is better to be ‘slow than blind’, we hope that if we get a higher pension, after retiring from the service we can live with dignity and not depend on anyone.  But as the money owed to the trust was not refunded, the RTC organization used it, so the future of about 42 thousand RTC families was in darkness.

 Therefore, we request you to intervene in this issue and see that the 1450 crores owed by the RTC management to the PF Trust is paid with interest, and save the future life of our labor families from darkness.  Also, we are appealing to the Chairman of Provident Fund Telangana Regional Committee, Special Chief Secretary, Labor Department to bring the issue to their attention and look into the discrimination going on in RPFC and Telangana RTC workers in Barkatpura and immediately ensure that all the eligible workers receive demand notices for higher pension.

 With thanks…

 (Viranjaneyulu) presidents.

 (V.Y. Rao) Chief Secretary.