Wife and husband relationship | భార్య భర్తల అనుబంధం | Telugu

Spread the love
Wife and husband relationship | భార్య భర్తల అనుబంధం | Telugu

ఈ వీడియో లో భార్యభర్తలు ఎలా ఉండాలి అను విషయాన్ని వివరించడం జరిగినది. ఈ వీడియో ప్రపంచంలోని ఏ దేశం couple కైనా వర్తిస్తుంది .

Wife and husband relationship

భార్య పట్ల భర్త ఎలా ప్రవర్తించాలి, మరియు భర్త పట్ల భార్య ఎలా ప్రవర్తించాలి అను పాయింట్స్ స్పష్టంగా చెప్పబడినది. ఇందులోని మేటర్ ను గ్రహించి పాటించిన ఎడల తప్పకుండ భార్య భర్తల మధ్య మంచి రిలేషన్స్ మైంటైన్ అవుతాయి.

భార్య భర్తల అనుబంధం

In this video, it is explained as to how wife and husband have to behave and maintain good relationship. Their good relationship will certainly yield good results such as mengtal peace and improve their firnancial position also.

Ideal couple – wife and husband
భార్య భర్తల బంధం
నీవెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించడం చాలా కష్టం.మొండిగా పొతే మొదటికే నష్టం. తన భర్త చేసే పనులలో సహకరించే భార్య దొరకడం నిజంగా దేవుడిచ్చిన వరం.
తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య ఒక వజ్రం.
అర్థం చేసుకునే భార్య దొరికితే, అడుక్కుతినే వాడు కూడా ఆనందంగా జీవిస్తాడు.
అహంకారి భార్య దొరికితే అంబాని కూడా అంతే సంగతులుసన్యాసమె శరణ్యం.
ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను చివరి బిడ్డగా పరిగణిస్తే ఇదే బలమైన  బంధం
భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం. బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.
సంసారం అంటే కలసి ఉండటమే కాదు. కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కడవరకుతోడూ వీడకుండా ఉండటం.
ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కాని అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మల్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.
భార్య భర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు. మధ్యలోనే పోతారు. భార్యకు భర్త శాశ్వతం. భర్తకు భార్య శాశ్వతం.
ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణి గొప్ప విద్యావంతురాలిక్రిందే లెక్క.
అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.
మోజు తీరగానే మూలనేసేది కాదు. మూడు ముళ్ళ బంధం. ముసలితనం లో కూడా మనసెరిగి ఉండేది మాంగల్య బంధం
బంధాలు శాశ్వతంగా తెగి పోకుండా ఉండాలంటే ఎదుటి వారు తప్పు చేస్తే క్షమించాలి, మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.
మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజు గా చేసి ఆ రాజుకు తను రాణి గా ఉంటుంది.
కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.
నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే. నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి జ్ఞాపకం నువ్వే.
సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం కుటుంబం
గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.
కలిమి లేములతో కలసిన మనసులతో కలివిడిగా మసలుకో కలకాలం సుఖసంతోషాలు పంచుకో.
బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజి మాత్రమె.
ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కాని మొత్తం పుస్తకాన్ని చించి వేయకూడదు.
భర్త భార్యకు బలం కావాలి. బలహీనత కాకూడదు.  భార్యకు భర్త భరోసా కావాలి, భారం కాకూడదు. భార్య భర్తల బంధం అన్యోన్యం కావాలి. అయోమయం కాకూడదు.
మనసు లోని ప్రేమను, బాధను కళ్లలో చూసి, చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగ దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు.  
అందాన్ని చూసి పెళ్లి  చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.
ముగింపు:
పెళ్లి అంటే ఈడు, జోడు, తోడూ, నీడ, కష్టం, సుఖం గురించి కాదు. ఇద్దరూ ఐక్యమైపోయి తమను ఉద్దరించుకొనే ఒక మంచి అవకాశం. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం. కాని తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం. వీరినే ideal couple అని అంటారు.  ఇటువంటి భార్య భర్తల అనుబంధం సదా వాంఛనీయం.
చిరునవ్వుతో కూడిన ఆదర్శదంపతులారా అందుకోండి. మనస్పూర్తిగా మీకు మా వందనాలు….’