Physical Address

304 North Cardinal St.
Dorchester Center, MA 02124

Impact of reforms on pensioners

This is from the pen of – P. Ajaya Kumar, Honorary President of All Pensioners and Retired Persons Association.

This post is available in Telugu English and Hindi.
Please refer to the Telugu version for any clarity.
పెన్షనర్లపై సంస్కరణల ప్రభావం

సంస్కరణల అమలులో భాగంగా 1995లో ప్రవేశ పెట్టిన మొదటి పథకం ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఇ.పి.ఎస్‌). ప్రభుత్వం లేదా ప్రైవేటు యజమానికి బాధ్యత లేకుండా కార్మికుల డబ్బు నుండి ప్రవేశ పెట్టిన పథకం ఇది. అటు యజమానిపై బాధ్యత ఉంచకుండా, ఇటు తను ఆ బాధ్యతను మోయకుండా కేంద్ర ప్రభుత్వం ఇ.పి.ఎస్‌ పెన్షనర్లకు చుక్కలు చూపిస్తోంది. ఇ.పి.ఎస్‌ కనీస పెన్షన్‌ రూ.వెయ్యి నుండి రూ.2 వేలకు పెంచటానికి తన వద్ద స్తోమత లేదని లోక్‌భలో వేసిన ప్రశ్నలపై సమాధానం చెబుతోంది. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీలిచ్చి, పెన్షనర్లకు మొండి చెయ్యి చూపిస్తోంది.

ఇ.పి.ఎస్‌ ఫండ్‌ నిల్వలు 2025 మార్చి 31 నాటికి రూ.9 లక్షల 93 వేల కోట్లు ఉన్నాయి. సంవత్సరానికి వడ్డీ, ఇతర ఆదాయాలు కలిపి రూ.60 వేల కోట్లు వచ్చింది. నిధికి చెల్లింపులు రూ.71,780 కోట్లు ఉన్నాయి. మొత్తం రాబడి సంవత్సరానికి రూ.లక్షా 31 వేల కోట్లు వస్తోంది. కానీ పెన్షన్‌ చెల్లింపులు సంవత్సరానికి రూ.23 వేల కోట్లు మించి లేవు. వచ్చే ఆదాయంలో సగం కూడా లేవు.

మొత్తం 81 లక్షల మంది పెన్షనర్లలో 60 శాతం మందికి కేవలం రూ.1,500 లోపు పెన్షన్‌ ఇస్తున్నారు. 97 శాతం మందికి వచ్చే పెన్షన్‌ రూ. 4 వేల లోపు మాత్రమే.
ఇ.పి.ఎస్‌ నిధులు కార్మికులవి. అవి కార్మికులకే ఉపయోగపడాలి.

ప్రభుత్వ విధానం దీనికి కూడా వ్యతిరేకంగా ఉంది. 2018-2019 నుండి 2023-2024 వరకు ఆరు సంవత్సరాల్లో ఇ.పి.ఎస్‌ నిధుల నిల్వలు 102 శాతం పెరిగితే, పెన్షన్లు ఇదే కాలంలో 27 శాతం మాత్రమే పెరిగాయి. పెన్షనర్ల సంఖ్య కూడా కేవలం 17.45 శాతమే పెరిగింది. ఇంత పెద్ద ఎత్తున నిల్వలు పోగు పడుతున్నప్పుడు 2025 మార్చి 31 నాటికి ఉన్న రూ.10 లక్షల కోట్లు ఫండ్‌ నిల్వలను ఖరారు చేసి, ఆపై ప్రతి సంవత్సరం వచ్చే జమలు రూ. లక్షా 30 వేల కోట్లతో ఇప్పుడు ఇచ్చే పెన్షన్‌ కంటే 6 రెట్లు పెన్షన్‌ ఎక్కువ ఇవ్వవచ్చు. పెన్షనర్లు కోరుతున్న కనీస పెన్షన్‌ రూ.9 వేలను సులభంగా ఇవ్వవచ్చు.

మోడీ ప్రభుత్వం ఆలోచన దీనికి విరుద్ధంగా ఉంది. పార్లమెంట్‌లో పాస్‌ చేసిన సామాజిక భద్రత చట్టాన్ని అడ్డం పెట్టుకొని స్కీములను మార్చి పెన్షన్‌ నిధులను విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ ద్రవ్య పెట్టుబడుల లాభాలను పెంచేందుకు వాటిని వినియోగించాలని చూస్తోంది. తమకు చెందిన నిల్వలను తమకు ఉపయోగించకుండా, ద్రవ్య పెట్టుబడుల ప్రయోజనాలకు మరల్చడాన్ని ఇ.పి.ఎస్‌ పెన్షనర్లు వ్యతిరేకించి పోరాడాలి.

ఇ.పి.ఎస్‌ పెన్షన్‌ సంస్కరణలకు తోడుగా స్వల్ప కాలంలోనే ఇతర పెన్షనర్లపై దాడి మొదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు-ఇన్సూరెన్స్‌ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లు కార్పొరేషన్లుగా మారిన విద్యుత్తు, బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ లో చేరిన ఉద్యోగులు ఈ సంస్కరణల ప్రభావ తీవ్రతను ఎదుర్కొంటున్నారు.

ప్రథమంగా 1997లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లపై దశలవారీగా ఖర్చు తగ్గించుకుంటామని అందులో పేర్కొంది.
1998లో వాజ్‌పేయి ప్రభుత్వం వృద్ధుల సామాజిక, ఆదాయ భద్రత పేరుతో ‘సెబి’ మొదటి చైర్మన్‌గా పనిచేసిన ఎస్‌.ఏ.దవే అధ్యక్షతన కమిటీ వేసింది. కమిటీ నివేదిక ఆధారంగా తన ఉద్యోగులకు పెన్షన్‌ ఇచ్చే బాధ్యత నుండి తప్పుకున్న వాజ్‌పేయి ప్రభుత్వం 2004 జనవరి 1 నుండి, ఆ తరువాత చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్‌ హక్కును హరించింది.

సర్వీసు ఆఖరి వేతనంలో 50 శాతం, దానిపైన డిఏ, కొత్త పి.ఆర్‌.సి వచ్చినప్పుడల్లా పెన్షన్‌ పెంపు ఉన్న పాత పెన్షన్‌ పథకం స్థానంలో, కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం ( సి.పి.ఎస్‌ ) వచ్చింది. ఈ సి.పి.ఎస్‌ కాస్త ఆచరణలో ఎన్‌.పి.ఎస్‌. (నో పెన్షన్‌ స్కీం)గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 2004 సెప్టెంబర్‌ 1 నుండి దీన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ రంగాల్లో 2010 ఏప్రిల్‌ 1 నుండి చేరిన ఉద్యోగులు కూడా పెన్షన్‌ హక్కు కోల్పోయారు.

రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీ విద్యుత్‌ బోర్డును కార్పొరేషన్లుగా విడగొట్టిన తర్వాత చేరిన ఉద్యోగులు, వాజ్‌పేయి ప్రభుత్వం టెలికమ్యూనికేషన్‌ శాఖను బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ గా మార్చిన తరువాత చేరిన ఉద్యోగులు పెన్షన్‌ హక్కు కోల్పోయారు. అతి స్వల్పంగా పెన్షన్‌ వచ్చే ఇ.పి.ఎఫ్‌ పథకంలోకి చేర్చారు.

కొత్త పెన్షన్‌ పథకంలో రిటైరైన వారికి వచ్చే పెన్షన్‌ అతి స్వల్ప స్థాయిలో వస్తుందని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సి.పి.ఎస్‌. (కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం)ను రద్దుచేసి ఓ.పి.ఎస్‌ (ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌)ను పునరుద్ధరించాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటాలను నీరుగార్చేందుకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం తెచ్చిన ఏకీకృత పెన్షన్‌ స్కీం (యు.పి.ఎస్‌.), రాష్ట్రంలో వై.సి.పి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీం (జి.పి.ఎస్‌.) లను సి.పి.ఎస్‌ ఉద్యోగులు ఆమోదించలేదు.

బాండ్లలో, షేర్‌ మార్కెట్లలో మదుపు చేసిన సి.పి.ఎస్‌. నిధుల నుండి ఎక్కువ ఆదాయం రావటం లేదని ఆచరణలో తేలింది. పబ్లిక్‌, ప్రైవేట్‌ పెన్షన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్స్‌ రంగంలో ఉన్నాయి. 2025 జనవరి నాటికి గత ఐదు సంవత్సరాలలో ఎల్‌.ఐ.సి పెన్షన్‌ ఫండ్‌ 8.94, యు.టి.ఐ పెన్షన్‌ ఫండ్‌ 8.85, ఎస్‌.బి.ఐ. పెన్షన్‌ ఫండ్‌ 8.59 శాతాల చొప్పున మాత్రమే ఆదాయాన్ని ఆర్జించాయి. ఇవి కూడా ద్రవ్య మార్కెట్‌ ఒడిదుడుకుల్లో ఎంత పోతాయి, ఎంత నిలుస్తాయనేది ఎవరూ చెప్పలేరు.

ఇటువంటి స్వల్ప ఆదాయాలను పెన్షన్‌గా భావించే అవకాశం లేదు. అందుకే సి.పి.ఎస్‌ ఉద్యోగులు ఆందోళన చెంది పోరాటాల్లోకి వస్తున్నారు.
భద్రతతో కూడిన పాత పెన్షన్‌ పథకంపై కూడా మోడీ ప్రభుత్వం దాడి మొదలు పెట్టింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు వారి పెన్షన్‌ అప్‌డేషన్‌ లేకుండా చేస్తూ చట్టంలో మార్పు చేసింది.

ఇక నుండి ఏ పి.ఆర్‌.సి హయాంలో ఉద్యోగ విరమణ పొందితే, ఆ పి.ఆర్‌.సి స్కేళ్లు, డి.ఏ ల ప్రకారం పెన్షన్‌ వస్తుంది. అంతకు ముందు ఉన్న పెన్షనర్ల పెన్షన్లు తాజా పర్చరు. పెన్షనర్ల మధ్య విభజన రేఖ గీసింది. రాబోయే కాలంలో పాత పెన్షన్‌ పథకానికి కూడా గ్యారంటీ లేని పరిస్థితి మొదలైంది.

ఒక్క వామపక్ష పార్టీలు మినహా మిగతా పాలక పార్టీలన్నీ పెన్షన్‌ సంస్కరణలను బాహాటంగా సమర్థిస్తున్నాయి. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నష్టదాయకమైన ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీం (ఇ.పి.ఎస్‌)ను రెండో బెనిఫిట్‌గా (పి.ఎఫ్‌ బదులు పెన్షన్‌) తీసుకొస్తే, అదే కేంద్రంలో ఉన్న వాజ్‌పేయి నాయకత్వంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వం, తన ఉద్యోగులకు పెన్షన్‌ హక్కు నిరాకరిస్తూ 2004, జనవరి 1 నుండి సి.పి.ఎస్‌ అమలు చేసింది. బిజెపి ని నిత్యం వ్యతిరేకించే రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం, 2004 సెప్టెంబర్‌ 1 నుండి సి.పి.ఎస్‌ ను అమలు చేసింది. వాజ్‌పేయి ప్రభుత్వం తీసుకొచ్చిన సి.పి.ఎస్‌ కు చట్టబద్ధతనిస్తూ, 2013లో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యు.పి.ఎ ప్రభుత్వం పార్లమెంట్‌లో పి.ఎఫ్‌.ఆర్‌.డి.ఏ బిల్లు ప్రవేశపెడితే వామపక్షాలు ఒక్కటే దాన్ని వ్యతిరేకించాయి. పాలక పార్టీలన్నీ బిల్లుకు అనుకూలంగా ఓటేశాయి. వామపక్ష పార్టీలు పశ్చిమ బెంగాల్‌, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో తాము అధికారంలో ఉన్నంతకాలం సి.పి.ఎస్‌ ను అమలు చేయకుండా, పాత పెన్షన్‌ పథకాన్ని కొనసాగించాయి.

పెన్షనర్లందరూ తమ హక్కులను కాపాడుకునేందుకు ఏక తాటి మీదకు రావలసిన అవసరం ఉంది. ఇ.పి.ఎస్‌, సి.పి.ఎస్‌, జి.పి.ఎస్‌, యు.పి.ఎస్‌ లేదా ఓ.పి.ఎస్‌ లతో నిమిత్తం లేకుండా ఐక్యం కావాలి. అలా అయితేనే ఉద్యోగులు, కార్మికులు తాము పని చేయగలిగిన కాలంలో… యజమానులు, ప్రజల సేవలో తమ శ్రమను ధారపోసినందుకుగాను, ఉద్యోగ విరమణ తర్వాత జీవితానికి భద్రత కల్పించే పెన్షన్‌ హక్కును కాపాడుకోగలుగుతారు.

దీనికోసం పెన్షనర్లందర్నీ ఐక్యం చేసే వేదికగా ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ (ఎ.పి.ఆర్‌.పి.ఏ), ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. పెన్షనర్లనే కాక పెన్షన్లు లేకుండా రిటైరైన వారిని కూడా ఐక్యం చేస్తుంది. ఒక యజమాని అంటూ లేకుండా పనిచేసి, వృద్ధాప్యంలో సామాజిక పెన్షన్లు పొందుతున్న వారిని కూడా ఏ.పి.ఆర్‌.పి.ఏ ఐక్యం చేస్తుంది. పెన్షనర్లందరి ఐక్యతే ఆయుధంగా పనిచేసే ఏ.పి.ఆర్‌.పి.ఏ రాష్ట్ర సదస్సు విజయవాడలో ఈ నెల 13న జరుగుతుంది.

– వ్యాసకర్త : పి. అజయ కుమార్‌, ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు

ENGLISH

Impact of reforms on pensioners

The first scheme introduced in 1995 as part of the implementation of reforms was the Employees Pension Scheme (EPS). This is a scheme introduced from the money of the workers without any responsibility to the government or the private employer. Without placing any responsibility on the employer, the central government is showing dots to EPS pensioners.

It is answering questions raised in the Lok Sabha that it does not have the capacity to increase the EPS minimum pension from Rs. 1,000 to Rs. 2,000. The Modi government is giving subsidies to corporates and showing a stubborn hand to pensioners.

The EPS fund reserves are Rs. 9 lakh 93 thousand crores as on March 31, 2025. The interest and other income received for the year is Rs. 60 thousand crores. The payments to the fund are Rs. 71,780 crores. The total revenue is Rs. 1.31 lakh crore per year. But pension payments do not exceed Rs. 23 thousand crore per year. Not even half of the income received. Out of the total 81 lakh pensioners, 60 percent are being given a pension of just under Rs. 1,500. The pension received by 97 percent is only under Rs. 4 thousand.

EPS funds belong to the workers. They should be used only by the workers. The government’s policy is also against this. While the EPS fund reserves increased by 102 percent in the six years from 2018-2019 to 2023-2024, pensions increased by only 27 percent during the same period. The number of pensioners also increased by only 17.45 percent. While such large reserves are accumulating, the fund reserves of Rs. 10 lakh crore as on March 31, 2025 will be finalized and then the deposits received every year will be Rs. With Rs 1.30 lakh crore, pension can be given 6 times more than the current pension. The minimum pension demanded by pensioners can easily be given Rs 9 thousand.

The Modi government’s thinking is the opposite. It is trying to change the schemes by obstructing the Social Security Act passed in Parliament and use the pension funds to increase the profits of foreign and domestic corporate financial investments. EPS pensioners should oppose and fight against the diversion of their savings to the interests of financial investments instead of using them.

Along with the EPS pension reforms, an attack on other pensioners started in a short time. Central and state government employees, bank-insurance employees, as well as employees who joined the electricity and BSNL, which have become corporations in government departments, are facing the severe impact of these reforms. First, in 1997, the Chandrababu Naidu government signed an agreement with the World Bank. It stated that the expenditure on salaries and pensions of government employees would be reduced in phases.

In 1998, the Vajpayee government set up a committee under the chairmanship of S.A. Dave, who served as the first chairman of ‘SEBI’, in the name of social and income security for the elderly. Based on the committee’s report, the Vajpayee government, which abdicated the responsibility of providing pension to its employees, took away the pension rights of central government employees who joined after January 1, 2004.

The old pension scheme, which had 50 percent of the last salary of service, DA on top of it, and a pension increase whenever a new PRC came, was replaced by the Contributory Pension Scheme (CPS). This CPS has become, in practice, NPS (No Pension Scheme). The state government has also been implementing it since September 1, 2004. Employees who joined government banks and insurance companies after April 1, 2010, have also lost their pension rights.

Employees who joined the state after the Chandrababu Naidu government split the AP Electricity Board into corporations, and employees who joined after the Vajpayee government converted the telecommunications department into BSNL, have lost their pension rights. They have been included in the EPF scheme, which provides a very small pension.

Central and state government employees, who have realized that the pension received by retirees under the new pension scheme is very low, are fighting on a large scale to abolish the CPS (Contributory Pension Scheme) and revive the OPS (Old Pension Scheme). To dilute these struggles, the Unified Pension Scheme (UPS) brought by the Modi government at the center and the Guaranteed Pension Scheme (GPS) introduced by the YCP government in the state have not been accepted by the CPS employees.

It has been found in practice that CPS funds invested in bonds and share markets do not generate much income. There are public and private pension fund managements in the sector. As of January 2025, LIC Pension Fund has earned only 8.94 percent, UTI Pension Fund 8.85 percent, and SBI Pension Fund 8.59 percent in the last five years. No one can say how much these will be lost or how much they will remain in the fluctuations of the money market. There is no possibility of considering such small incomes as pension. That is why CPS employees are getting worried and are coming into the struggle.

The Modi government has also started attacking the old pension scheme with security. It has changed the law by making it impossible for central government pensioners to have their pension updated. From now on, if you retire during the tenure of any PRC, you will get pension according to that PRC scales and DA. The pensions of the previous pensioners will not be updated. A dividing line has been drawn between the pensioners. In the coming period, there is no guarantee for the old pension scheme.

Except for the Left parties, all the other ruling parties are openly supporting pension reforms. While the Congress party at the center brought the loss-making Employees Pension Scheme (EPS) as a second benefit (pension instead of PF), the BJP government at the center under the leadership of Vajpayee, denied pension rights to its employees and implemented the CPS from January 1, 2004. The state Congress government, which has always opposed the BJP, implemented the CPS from September 1, 2004. When the Congress-led UPA government introduced the PFRDA bill in Parliament in 2013, legalizing the CPS introduced by the Vajpayee government, the Left was the only party to oppose it. All the ruling parties voted in favor of the bill. The Left parties did not implement the CPS in the states of West Bengal, Tripura, and Kerala as long as they were in power, and continued the old pension scheme.

All pensioners need to come together to protect their rights. They should unite regardless of EPS, CPS, GPS, UPS, or OPS. Only then will employees and workers be able to protect their right to a pension that provides security for life after retirement, while they are able to work… for the sake of the employers and the people, for their hard work and dedication.

For this, the All Pensioners and Retired Persons Association (APRPA), Andhra Pradesh has been formed as a platform to unite all pensioners. It unites not only pensioners but also those who have retired without pensions. APRPA also unites those who work without an employer and receive social pensions in old age. The APRPA state conference, which serves as a weapon of unity for all pensioners, will be held in Vijayawada on the 13th of this month.

– Author: P. Ajaya Kumar, Honorary President of All Pensioners and Retired Persons Association.

HINDI

पेंशनभोगियों पर सुधारों का प्रभाव

सुधारों के कार्यान्वयन के तहत 1995 में शुरू की गई पहली योजना कर्मचारी पेंशन योजना (EPS) थी। यह सरकार या निजी नियोक्ता के प्रति किसी भी ज़िम्मेदारी के बिना, कर्मचारियों के पैसे से शुरू की गई योजना है। नियोक्ता पर कोई ज़िम्मेदारी डाले बिना, केंद्र सरकार EPS पेंशनभोगियों को ठेंगा दिखा रही है। वह लोकसभा में उठाए गए सवालों का जवाब दे रही है कि उसके पास EPS न्यूनतम पेंशन को 1,000 रुपये से बढ़ाकर 2,000 रुपये करने की क्षमता नहीं है। मोदी सरकार कॉर्पोरेट्स को सब्सिडी दे रही है और पेंशनभोगियों के प्रति हठधर्मिता दिखा रही है।

31 मार्च, 2025 तक EPS निधि का भंडार 9 लाख 93 हज़ार करोड़ रुपये है। वर्ष के लिए प्राप्त ब्याज और अन्य आय 60 हज़ार करोड़ रुपये है। निधि को भुगतान 71,780 करोड़ रुपये है। कुल राजस्व 1.31 लाख करोड़ रुपये प्रति वर्ष है। लेकिन पेंशन भुगतान प्रति वर्ष 23 हज़ार करोड़ रुपये से अधिक नहीं है। प्राप्त आय का आधा भी नहीं। कुल 81 लाख पेंशनभोगियों में से 60 प्रतिशत को मात्र 1,500 रुपये से कम पेंशन दी जा रही है। 97 प्रतिशत को मिलने वाली पेंशन मात्र 4,000 रुपये से कम है।

ईपीएस फंड श्रमिकों का है। इसका उपयोग केवल श्रमिकों द्वारा ही किया जाना चाहिए। सरकार की नीति भी इसके विरुद्ध है। 2018-2019 से 2023-2024 तक छह वर्षों में ईपीएस फंड रिजर्व में जहाँ 102 प्रतिशत की वृद्धि हुई, वहीं इसी अवधि में पेंशन में केवल 27 प्रतिशत की वृद्धि हुई। पेंशनभोगियों की संख्या में भी केवल 17.45 प्रतिशत की वृद्धि हुई। जब इतना बड़ा रिजर्व जमा हो रहा है, तो 31 मार्च, 2025 तक 10 लाख करोड़ रुपये का फंड रिजर्व अंतिम रूप ले लेगा और तब हर साल प्राप्त होने वाली जमा राशि 1.30 लाख करोड़ रुपये होगी, जिससे वर्तमान पेंशन से 6 गुना अधिक पेंशन दी जा सकती है। पेंशनभोगियों द्वारा माँगी जाने वाली न्यूनतम पेंशन आसानी से 9,000 रुपये दी जा सकती है।

मोदी सरकार की सोच इसके विपरीत है। वह संसद में पारित सामाजिक सुरक्षा अधिनियम में बाधा डालकर योजनाओं में बदलाव लाने और पेंशन निधि का उपयोग विदेशी और घरेलू कॉर्पोरेट वित्तीय निवेशों के मुनाफे को बढ़ाने के लिए करने की कोशिश कर रही है। ईपीएस पेंशनभोगियों को अपनी बचत का उपयोग करने के बजाय उसे वित्तीय निवेशों के हितों में लगाने का विरोध और संघर्ष करना चाहिए।

ईपीएस पेंशन सुधारों के साथ ही, कुछ ही समय में अन्य पेंशनभोगियों पर हमला शुरू हो गया। केंद्र और राज्य सरकार के कर्मचारी, बैंक-बीमा कर्मचारी, साथ ही सरकारी विभागों में निगम बन चुके बिजली और बीएसएनएल से जुड़े कर्मचारी इन सुधारों का गंभीर प्रभाव झेल रहे हैं। सबसे पहले, 1997 में, चंद्रबाबू नायडू सरकार ने विश्व बैंक के साथ एक समझौते पर हस्ताक्षर किए। इसमें कहा गया था कि सरकारी कर्मचारियों के वेतन और पेंशन पर खर्च को चरणबद्ध तरीके से कम किया जाएगा।

1998 में, वाजपेयी सरकार ने बुजुर्गों के लिए सामाजिक और आय सुरक्षा के नाम पर एस.ए. दवे, जो ‘सेबी’ के पहले अध्यक्ष थे, की अध्यक्षता में एक समिति का गठन किया। समिति की रिपोर्ट के आधार पर, वाजपेयी सरकार, जिसने अपने कर्मचारियों को पेंशन देने की ज़िम्मेदारी छोड़ दी थी, ने 1 जनवरी, 2004 के बाद शामिल हुए केंद्र सरकार के कर्मचारियों के पेंशन अधिकार छीन लिए।

पुरानी पेंशन योजना, जिसमें सेवा के अंतिम वेतन का 50 प्रतिशत, उसके ऊपर महंगाई भत्ता, और नई पेंशन योजना आने पर पेंशन में वृद्धि शामिल थी, को अंशदायी पेंशन योजना (CPS) से बदल दिया गया। यह CPS, व्यवहार में, NPS (नो पेंशन स्कीम) बन गई है। राज्य सरकार भी 1 सितंबर, 2004 से इसे लागू कर रही है। 1 अप्रैल, 2010 के बाद सरकारी बैंकों और बीमा कंपनियों में शामिल हुए कर्मचारियों ने भी अपने पेंशन अधिकार खो दिए हैं।

चंद्रबाबू नायडू सरकार द्वारा आंध्र प्रदेश विद्युत बोर्ड को निगमों में विभाजित करने के बाद राज्य में शामिल हुए कर्मचारी, और वाजपेयी सरकार द्वारा दूरसंचार विभाग को बीएसएनएल में बदलने के बाद शामिल हुए कर्मचारी, अपने पेंशन अधिकार खो चुके हैं। उन्हें EPF योजना में शामिल किया गया है, जो बहुत कम पेंशन प्रदान करती है।

केंद्र और राज्य सरकार के कर्मचारी, जिन्हें यह एहसास हो गया है कि नई पेंशन योजना के तहत सेवानिवृत्त कर्मचारियों को मिलने वाली पेंशन बहुत कम है, सीपीएस (अंशदायी पेंशन योजना) को समाप्त करने और ओपीएस (पुरानी पेंशन योजना) को पुनर्जीवित करने के लिए बड़े पैमाने पर संघर्ष कर रहे हैं। इन संघर्षों को कमज़ोर करने के लिए, केंद्र की मोदी सरकार द्वारा लाई गई एकीकृत पेंशन योजना (यूपीएस) और राज्य में वाईसीपी सरकार द्वारा शुरू की गई गारंटीकृत पेंशन योजना (जीपीएस) को सीपीएस कर्मचारियों ने स्वीकार नहीं किया है।

व्यवहार में यह पाया गया है कि बॉन्ड और शेयर बाज़ार में निवेश किए गए सीपीएस फंड से ज़्यादा आय नहीं होती है। इस क्षेत्र में सार्वजनिक और निजी पेंशन फंड प्रबंधन मौजूद हैं। जनवरी 2025 तक, एलआईसी पेंशन फंड ने पिछले पाँच वर्षों में केवल 8.94 प्रतिशत, यूटीआई पेंशन फंड ने 8.85 प्रतिशत और एसबीआई पेंशन फंड ने 8.59 प्रतिशत की आय अर्जित की है। कोई नहीं कह सकता कि मुद्रा बाज़ार के उतार-चढ़ाव में इनमें से कितना नुकसान होगा या कितना रहेगा। इतनी कम आय को पेंशन मानने की कोई संभावना नहीं है। इसीलिए सीपीएस कर्मचारी चिंतित हो रहे हैं और संघर्ष के लिए उतर रहे हैं।

मोदी सरकार ने पुरानी पेंशन योजना पर भी सुरक्षा के साथ हमला करना शुरू कर दिया है। उसने कानून में बदलाव करके केंद्र सरकार के पेंशनभोगियों के लिए अपनी पेंशन अपडेट करवाना असंभव बना दिया है। अब से, अगर आप किसी भी पीआरसी के कार्यकाल के दौरान सेवानिवृत्त होते हैं, तो आपको उसी पीआरसी के वेतनमान और डीए के अनुसार पेंशन मिलेगी। पिछले पेंशनभोगियों की पेंशन अपडेट नहीं की जाएगी। पेंशनभोगियों के बीच एक विभाजन रेखा खींच दी गई है। आने वाले समय में पुरानी पेंशन योजना की कोई गारंटी नहीं है।

वामपंथी दलों को छोड़कर, बाकी सभी सत्तारूढ़ दल पेंशन सुधारों का खुलकर समर्थन कर रहे हैं। केंद्र में कांग्रेस पार्टी घाटे में चल रही कर्मचारी पेंशन योजना (ईपीएस) को दूसरे लाभ (पीएफ की जगह पेंशन) के रूप में लेकर आई, वहीं वाजपेयी के नेतृत्व वाली केंद्र की भाजपा सरकार ने अपने कर्मचारियों को पेंशन के अधिकार से वंचित कर दिया और 1 जनवरी, 2004 से सीपीएस लागू कर दिया। राज्य की कांग्रेस सरकार, जो हमेशा भाजपा का विरोध करती रही है, ने 1 सितंबर, 2004 से सीपीएस लागू कर दिया। जब कांग्रेस के नेतृत्व वाली यूपीए सरकार ने 2013 में वाजपेयी सरकार द्वारा शुरू की गई सीपीएस को वैध बनाने के लिए संसद में पीएफआरडीए विधेयक पेश किया, तो वामपंथी दल ही इसका विरोध करने वाला एकमात्र दल था। सभी सत्तारूढ़ दलों ने विधेयक के पक्ष में मतदान किया। वामपंथी दलों ने पश्चिम बंगाल, त्रिपुरा और केरल में सत्ता में रहते हुए सीपीएस लागू नहीं किया और पुरानी पेंशन योजना को जारी रखा।

सभी पेंशनभोगियों को अपने अधिकारों की रक्षा के लिए एकजुट होने की जरूरत है। उन्हें ईपीएस, सीपीएस, जीपीएस, यूपीएस या ओपीएस की परवाह किए बिना एकजुट होना चाहिए। तभी कर्मचारी और श्रमिक सेवानिवृत्ति के बाद जीवन भर सुरक्षा प्रदान करने वाली पेंशन के अपने अधिकार की रक्षा कर पाएँगे, जब तक वे नियोक्ताओं और जनता के लिए, अपनी कड़ी मेहनत और समर्पण के लिए काम कर पाएँगे।

इसके लिए, सभी पेंशनभोगियों को एकजुट करने के एक मंच के रूप में अखिल पेंशनभोगी एवं सेवानिवृत्त व्यक्ति संघ (एपीआरपीए), आंध्र प्रदेश का गठन किया गया है। यह न केवल पेंशनभोगियों को, बल्कि बिना पेंशन के सेवानिवृत्त हुए लोगों को भी एकजुट करता है। एपीआरपीए उन लोगों को भी एकजुट करता है जो बिना नियोक्ता के काम करते हैं और वृद्धावस्था में सामाजिक पेंशन प्राप्त करते हैं। एपीआरपीए का राज्य सम्मेलन, जो सभी पेंशनभोगियों के लिए एकता का हथियार है, इस महीने की 13 तारीख को विजयवाड़ा में आयोजित किया जाएगा।

– लेखक: पी. अजय कुमार, अखिल पेंशनभोगी एवं सेवानिवृत्त व्यक्ति संघ के मानद अध्यक्ष

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *