APRPA dharna for justifiable eps 95 pension

తెలంగాణా ఆల్ పెన్షనర్స్ &

రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్

(TAPRPA),హైదరాబాదు. 

16.11.2021 మంగళవారం 

EPS పెన్షనర్ల విద్రోహ దినం.

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

ధర్నాను జయప్రదం‌ చేయండి.

      *         *       *      

మిత్రులారా!

    కేంద్ర ప్రభుత్వ రాజపత్రం

(గెజిట్)ద్వారా 16.11.1995

నుండి అమలులోకి వచ్చిన

‘ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం (EPS)ప్రకారం పరిశ్రమల,

ఇతర సంస్థల కార్మికుల,

ఉద్యోగుల పెన్షన్ కు తీవ్ర

అన్యాయం జరిగింది.ఆనాడే ఆ స్కీమును గట్టిగా వ్యతిరేకించిన మనకు “రెండు సంవత్సరాల

తరువాత ఈ స్కీమును

సమీక్ష(రివ్యూ)చేస్తాం” అని

ఆనాటి కేంద్ర కార్మిక మంత్రి

కీ.శే.జి.వెంకటస్వామిగారు

ఇచ్చిన హామీ 26 ఏళ్ళు గడిచినా,అనేక ప్రభుత్వాలు మారినా ఈనాటికీ

నెరవేరకపోవడం ఘోరమైన అన్యాయం. 

     ఈ స్కీం ఫలితంగా దేశవ్యాప్తంగా 65 లక్షలమంది

EPS పెన్షనర్లు తీవ్ర అన్యాయానికి గురి అయ్యారు.

ఈ 26 ఏళ్ళలో కేంద్ర,రాష్ట్రాల

ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు

అనేక సార్లు వేతన సవరణను

చేశాయి.నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువుభత్యాన్ని

పెంచుతున్నాయి.కాని EPS

పెన్షనర్లు మాత్రం వారు రిటైరైన నాడు ఎంత పెన్షన్ నిర్ణయం

అయిందో దశాబ్దాల తరబడి

పైసా పెరుగకుండా అదే పెన్షన్ ను పొందుతున్నారు.వీరిలో

అత్యధికులకు నెలకు వేయి

రూపాయలుకూడా రావడం

లేదంటే ఈ అన్యాయపు తీవ్రత

అర్థం అవుతుంది.

రు.300/-,500/- ఉన్న ఈ పెన్షన్ మన సుదీర్ఘ పోరాటాల వల్లనే వేయి రూపాయలు అయింది.

మానవమాత్రుడు ఎవరైనా ఈ

పెన్షన్ తో ఎట్లా బతుకుతాడు?

-అన్న ఆలోచనే రాని పాలకులు

తమతమ జీత భత్యాలను

మాత్రం ఇష్టానుసారంగా పెంచుకుంటూ కూడా EPS పెన్షనర్లపట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ఆలోచించండి.

     మన రాష్ట్ర సంఘం (TAPRPA),మన జాతీయ సంఘం ‘ఆల్ ఇండియా కో-ఆర్డి

నేషన్ కమిటీ ఆఫ్ EPF

పెన్షనర్స్ అసోసియేషన్స్’

అనేక ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వాలకు,కార్మిక మంత్రులకు,పార్లమెంట్ సభ్యులకు,సెంట్రల్ బోర్డ్ ఆఫ్

ట్రస్టీస్(CBT) సభ్యులకు ఎన్నో

వినతి పత్రాలను ఇచ్చినా, రాష్ట్ర రాజధానులలో,దేశ రాజధాని ఢిల్లీలో లెక్కలేనన్ని

సార్లు ధర్నాలు,నిరాహార/నిరసన దీక్షలు చేసినా,అనేక

రాష్ట్రాల హైకోర్టులు మనకు

అనుకూలంగా తీర్పులు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వాలలో

చలనం లేకపోవడం మనపట్ల

వారి నిర్లక్ష్య వైఖరిని,లెక్కలేని

తనాన్ని వెల్లడిస్తున్నది.

   ఈ పరిస్థితుల్లో మన జాతీయ సంఘం (AICC

EPFPA)పిలుపును అనుసరించి ప్రతి ఏడు జరుపుతున్నట్టుగానే ఈసారి కూడా నవంబర్ 16 వతేదీని

 EPS పెన్షనర్ల  విద్రోహ దినం 

గా మనం జరుపుతున్నాం.            ఈ సందర్భంలో 16.11.2021

మంగళవారం ఉదయం 10

గంటలనుండి బర్కత్ పురా,

కూకట్ పల్లి,పటాన్ చెరువు

లలోని PF కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున

        ధర్నా లను

నిర్వహిస్తున్నాం.

    EPF పెన్షనర్లు,మిత్రులు తమకు సమీపంలోని ధర్నాలో

పాల్గొని జయప్రదం చేయాలని,

ఆ రకంగా కేంద్ర ప్రభుత్వంపై

ఒత్తిడిని పెంచి, మనకు అనుకూలమైన నిర్ణయాలను సాధించాలని కోరుతున్నాం.

      నెలకు రు.9,000/-కనీస పెన్షన్ ను,కరువు భత్యాన్ని, వైద్యం వంటి ఇతర‌ సదుపాయాలను సాధించేదాకా

మన పోరాటం సాగుతుంది.

       బర్కత్ పురాలో జరిగే

ధర్నాలో మన జాతీయ అధ్యక్షులు ఎం‌ఎన్.రెడ్డిగారు,

రాష్ట్ర అధ్యక్షులు పాలకుర్తి

కృష్ణమూర్తిగారు,తదితర

నాయకులు పాల్గొంటారు.

పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలి!

మనం పోరాడుతాం-

        మనం గెలుస్తాం.

అభినందనలతో-

TAPRPA రాష్ట్ర కమిటీ.

13.11.2021-హైదరాబాదు.

Please click here to learn similar content of eps 95 pension in the Linktree