CBT-229 meeting on EPFO

మిత్రులారా,
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కి చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ trustees 229 వ సమావేశం 20 నవంబర్, 2021 న న్యూఢిల్లీలో జరిగింది.

కార్మిక శాఖ మాత్యులు శ్రీ భూపేంద్ర యాదవ్ గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. కార్మిక శాఖ సహాయ మంత్రి, సి బి టి ఉపాధ్యక్షులు, మరియు కార్మిక శాఖ కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి మరియు ఇతర అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

సి ఐ టి యు,(సిఐటియు నాయకులు పద్మనాభం) బి ఎం ఎస్, ఏఐటీయూసీ, హెచ్ ఎం ఎస్, మరియు ఏ ఐ యు యు టి యు సి ప్రతినిధులు పాల్గొన్నారు

Please click here to know the details of the CBT-229 meeting in English.

సమావేశాన్ని ప్రారంభిస్తూ కార్మిక శాఖ మాత్యులు ప్రభుత్వం సాధించిన విజయాలు తెలియజేశారు. తదుపరి కార్మిక శాఖ కార్యదర్శి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించిన అంశాలు, ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పని విధానం తదితర అంశాలు తెలియజేశారు.

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

సమావేశాల ప్రారంభానికి ముందు కార్మిక సంఘాల ప్రతినిధులు కొన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరగా అధ్యక్షత వహిస్తున్న కార్మిక శాఖ మాత్యులు అందుకు అంగీకరించారు. అన్ని అంశాలను దాదాపు రెండు గంటల సేపు కార్మిక సంఘాల ప్రతినిధులు, యాజమాన్య ప్రతినిధులు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు.

Please click this Text here to join this WhatsApp Group for the latest Eps 95 pension updates.

CBT-229 meeting

సిఐటియు నాయకులు ఏ.కే. పద్మనాభం గారు కనీస పెన్షన్ పెన్షన్ సమస్యపై సుప్రీం కోర్టు కేసు, కేవైసీ వివరాలు నమోదు లో బీడీ తదితర తరగతుల కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే సి బి టి సభ్యులు లేవనెత్తిన సమస్యలపై అధికార యంత్రాంగం యొక్క వైఖరి, ఉద్యోగుల పెన్షన్, ఈపీఎఫ్ ఓ పెన్షనర్స్, తదితర అంశాలను సిఐటియు నాయకులు పద్మనాభం గారు ప్రస్తావించారు.

ఈపీఎఫ్వో కార్మిక శాఖ పరిధిలో ఉన్నందున పారిశ్రామిక సంబంధాలు గుర్తింపు పొందిన ఫెడరేషన్ లు లేవనెత్తిన అంశాల పరిష్కారంలో సరైన పద్ధతుల్లో వ్యవహరించి మిగతా అన్ని సంస్థలకు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అలా జరగడం లేదని సభ్యులంతా నొక్కి చెప్పారు.

కనీస పెన్షన్ పెంచాల్సిన అవసరం పై సి బి టి సభ్యుల ప్రతినిధి బృందాన్ని ఆర్థిక శాఖ మంత్రి గారి వద్దకు తీసుకువెళ్లాలని సి బి టి సభ్యులు గత కార్మిక శాఖ మంత్రులకు పలు దఫాలు తెలియజేశారు. అయినా ఇంతవరకూ అది జరగలేదని కార్మిక కార్మిక సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.

కనీస పెన్షన్ పెంచాల్సిన ఆవశ్యకతను, అలా పెరగని కారణంగా సర్వీస్ లో ఉన్న కార్మికులలో అసంతృప్తి నెలకొంటున్న కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఒక యజమానుల ప్రతినిధి గారు కూడా సమావేశంలో ప్రస్తావించారు.

ఇది గమనించదగిన ఒక ముఖ్య విషయం. ఇవన్నీ సానుకూలంగా విన్న కార్మిక శాఖ మాత్యులు ఈపీఎఫ్ నిర్వహణ, నూతన కార్మిక కోడ్ -సామాజిక సంక్షేమం, పెన్షన్ మరియు ఈ అడ్మినిస్ట్రేషన్ అనే నాలుగు అంశాల పై సబ్ కమిటీల నియామకం గురించి ప్రతిపాదించారు.

ఈ నాలుగు కమిటీలలో రెండింటికి కార్మిక శాఖ సహాయ మంత్రి అధ్యక్షులు గా ఉంటారు. మరొక రెండు సబ్ కమిటీ లకు కార్మిక శాఖ కార్యదర్శి అధ్యక్షులు గా ఉంటారు.

ఈ అన్ని సబ్ కమిటీ లలో కార్మిక సంఘాల, యాజమాన్యాల, ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు.

ఈ కమిటీలు సమావేశమై అందుకు సంబంధించిన అంశాలపై కూలంకషంగా చర్చించి తదుపరి జరగబోయే సి బి టి మీటింగ్ లో నివేదికలను చర్చకు ప్రవేశపెడతారు. సి బి టి మీటింగ్ ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా జరుగుతుందని అవసరమైతే సమావేశం రెండు రోజుల పాటు కూడా జరుపుతాననికార్మిక శాఖ మాత్యులు హామీ ఇచ్చారు.

అలాగే ఆజెండాలో లేని అంశాలను సి బి టి సభ్యులు ప్రస్తావించడానికి వీలుగా సిబిటి సమావేశంలో జీరో అవర్ ను కూడా ప్రవేశ పెడతానని మంత్రి గారు హామీ ఇచ్చారు.

ఈ ప్రతిపాదనలు అన్నిటిని సి బి టి సభ్యులు ఆమోదించారు.

తదుపరి అజెండాలోని అంశాలపై చర్చ జరిగింది. ప్రధానంగా సి బి టి, ఈపీఎఫ్ ఓ కు సంబంధించిన నిర్వహణ అంశాలు ఇందులో ఉన్నాయి.

మరొక ప్రధానమైన అంశం పెన్షన్ మరియు పిఎఫ్ నిధులను ఇతర సంస్థల్లో పెట్టుబడి పెట్టడానికి సంబంధించినవి.

ప్రభుత్వం నోటిఫై చేసిన వివిధ రకాల అన్ని సంస్థలలో పెట్టుబడులు పెట్టడాన్ని గతంలో సి బి టి సభ్యులు నిరాకరించారు. ప్రస్తుతం చాలా పెట్టుబడులపై వస్తున్నటువంటి వడ్డీ నామమాత్రంగా ఉంది.

ఫలితంగా పెట్టుబడులు పెట్టడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుచేత మరి కొన్ని రకాల సంస్థలలో కూడా పెట్టుబడులు పెట్టాలని ఎఫ్ ఐ ఎ సి సబ్ కమిటీ ప్రతిపాదించింది. దీనిపై ఏ అంశానికి ఆ అంశం పై విడివిడిగా ఎఫ్ ఐ ఏ సి నిర్ణయం తీసుకుంటుంది అని సబ్ కమిటీ ప్రతిపాదించింది. దీనికి బోర్డు ఆమోదం తెలియజేసింది.

హైయర్ పెన్షన్ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించి స్టేటస్ note లో వివిధ కోర్టులలో 33 వేల కేసులు ఉన్నట్లుగా తెలియజేశారు. దీనిపై కార్మిక సంఘాల ప్రతినిధులు స్పందిస్తూ కోర్టు వివాదాలు, కేసులను సాధ్యమైనంత తగ్గేందుకు, పరిష్కరించేందుకు, కోర్టుల దాకా వెళ్లకుండానే పరిష్కరించాలని సూచించారు.

ప్రావిడెంట్ ఫండ్ నిధులు కొందరు దొంగిలించడానికి సంబంధించిన విషయంపై అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో అలా జరగకుండా నివారించడానికి చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ మాత్యులు సభ్యులకు హామీ ఇచ్చారు.

ఉపాధి కల్పన కోసం యజమానులకు ఈపీఎఫ్ ఓ నుండి ఇస్తున్న బెనిఫిట్స్ కు సంబంధించి వాటి సంఖ్య, పేర్లు తదితర వివరాలన్నింటినీ పారదర్శకంగా బహిర్గతం చేయాలని సి బి టి సభ్యులు కోరగా, దీనికి మంత్రిగారు ఆమోదం తెలియజేశారు. సమావేశాన్ని ముగిస్తూ నిర్ణయాలు పారదర్శకంగా తెలియజేయడం జరుగుతుందని కార్మిక శాఖ మాత్యులు తెలియజేశారు.

ముఖ్య గమనిక: సి బి టి సమావేశంలో పాల్గొన్న సి ఐ టి యు అఖిలభారత నాయకులు ఏ కే పద్మనాభన్ గారు తెలియజేసిన వివరాల ఆధారంగా ఈ సమాచారం తయారుచేయబడింది.
ఆర్. లక్ష్మయ్య