పిల్లలు మరియు వారి ఆహారపు అలవాట్లు వీటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం

పిల్లలు కడుపు నిండా తింటే చాలు అని తల్లిదండ్రులు అనుకుంటారు అవునా మరి పిల్లల ఏమనుకుంటారు రుచికరమైనవి తింటే చాలు అని అనుకుంటారు

ఇంకొకటి ఇక్కడ సరి అయిన పోషక ఆహారం పిల్లలకి అందుతుందా?

నన్ను అడిగితే నేనైతే చెప్తాను పిల్లలకు సరైన పోషకాహారం అందడం లేదు

ఒకప్పుడు మన పెద్దవాళ్ళు తిన్న తిండి ఆహారపు అలవాట్లు వేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు తింటున్న ఆహారం అలవాట్లు అన్నీ వేరు

అందుకే కాబోలు పిల్లలకు ఇప్పుడు అస్సలు రోగనిరోధక శక్తి లేదు ఎముకలు బలంగా లేవు త్వరగా నీరసించి పోతున్నారు పట్టుమని పది నిమిషాలు చురుకుగా ఆడుకుంటే మరో పది నిమిషాలు విశ్రాంతి కోరుకుంటున్నారు

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

చాలామంది తల్లిదండ్రులు అనుకోవచ్చు నేను మా పిల్లలకి ఆహారం అందిస్తున్నాం మంచిద టిఫిన్లు ఇస్తున్నాం పాలు ఇస్తున్నాం ఇస్తున్నాం చక్కగా మాంసాహారం పెడుతున్నాం గుడ్లు ఇస్తున్నాం అని అనుకోవచ్చు

ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది అదేమిటంటే ఫర్టిలైజ్ ఫుడ్ మరియు  జంక్ ఫుడ్.

రకరకాల రసాయనాలు వేసి పండించడం వలన అదే ఆహారం తీసుకోవడం చాలా కల్తీ అందువలన పిల్లలకు చక్కటి ఆరోగ్యం ఉండడంలేదు

ఇంకా జంక్ ఫుడ్ మీద పిల్లలకి ఉన్న అపారమైన ప్రేమ ఈ పిల్లల పైన తల్లిదండ్రులకు ఉన్న అతి ప్రేమ వలన పిల్లల ఆరోగ్యం రోజురోజుకు ఇంకా క్షీణించిపోతుంది

దయచేసి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి శరీరానికి ఎలాంటి ఆహారం అయితే అవసరం ఉందో అలాంటి ఆహారం మాత్రమే ఎంచుకోవాలి

ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ సరైన ఆహారం అంటే అదేమిటి అని అవునా ప్రోటీన్ మంచి ప్రోటీన్ ఆహారం కూరగాయలు మంచి పండ్లు ఆకుకూరలు ఉడకబెట్టిన గ్రుడ్లు ఇలా ఇవన్నీ కూడా వారి రోజూ ఆహారంలో చేర్చగలిగితే వారికి ఎంతో మేలు జరుగుతుంది

మీ పిల్లల గురించి కాస్త శ్రద్ధ వహించండి అజాగ్రత్త అసలు వద్దు వారి చక్కటి ఆరోగ్యం కోసం ఇలాంటి మంచి పౌష్టిక ఆహారాన్ని వారికి అందించండి దయచేసి స్విగ్గి జొమాటో అంటూ నిమిషాల్లోనే ఇంటికి ఫుడ్ వచ్చేస్తుంది అంటూ ఈ పిజ్జాలు బర్గర్లు ఇలాంటివి దయచేసి తినిపించకండి

చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మన చిన్న చిన్న పిల్లల్ని వారి ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం

ఈ రోజుతో ఈ అంశంతో సమాప్తం మళ్లీ రేపు ఇంకొక అంశంపై మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు