Epf 95 pension latest news
To,
శ్రీ బండి సంజయ్ కుమార్ , [[email protected]]
రాష్ట్ర అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ.
గౌరవనీయులు సార్,
మేము, తెలంగాణ రాష్ట్రానికి చెందిన EPS 95 యొక్క పెన్షనర్లు జీవనోపాధి నిర్వహణకు సంబంధించి తీవ్ర మనోవేదనలను కలిగి ఉన్నాము. మేము మా పెన్షన్‌ను రూ. 1000 నుండి దాదాపు రూ. 2500 వరకు పొందుతాము, ఇది ప్రస్తుత ఖర్చుతో జీవిత ప్రాథమిక అవసరాలకు సరిపోదు.
తెలంగాణ రాష్ట్రంలోని EPS 95 పింఛనుదారులందరి తరపున మేము ఈ విన్నపం చేయుచున్నాము.
ఈ నెల 26 వ తేదీన కాని, సమీప భవిష్యత్తు లో కాని మన ప్రధానమంత్రి గారు హైదరాబాద్ కు వచ్చు అవకాశం కలదు అని తెలియవచ్చినది. మా న్యాయమైన మినిమమ్ పెన్షన్ పెంపుదల నిర్ణయం త్వరగా తీసుకొనుటకు ప్రధానమంత్రి గారి దృష్టి కి తీసుకువెళ్లి ఒప్పించవలసినదిగా కోరడమైనది.
చాలా మంది EPS 95 పెన్షనర్లు ప్రస్తుతం జీవనోపాధి అవసరాలు మరియు వైద్య ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడవలసిన పరిష్టితులు ఉన్నాయి.
కనుక, ప్రస్తుత ఈ సామాజిక సమస్యను, విజ్ణులైన మీరు, ప్రధానమంత్రి దృష్టికి సమర్ధవంతంగా తీసుకెళ్లి ఆయనను ఒప్పించి, వృద్ధ పెన్షనర్లకు మీ తోడ్పాటు అందించవలసినదిగా అభ్యర్థిస్తున్నాము.
గౌరవాలతో
మీ భవదీయుడు
70 లక్షల మంది Eps 95 మంది పెన్షనర్ల తరపున.
గమనిక: పైన ఇచ్చిన ఈమైల్ అడ్రెస్ కు ఈ లెటర్ ను మీ ఈమైల్ నుంచి పంపపగలరు.
ఈ కంటెంట్ ఇచ్చిన Eps 1995 సమన్వయ కమిటీ జాతీయ కార్యదర్శి శ్రీ శ్యాంరావుకు ధన్యవాదాలు.