Eps 95 Higher pension news

Original content is Telugu.

Please press here to read the Post in English

ప్రియమైన మిత్రులారా అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు.

2022,నవంబర్ 4వ తేదీన తెలువడిన గౌరవ సుప్రీం కోర్టు తీర్పును పూర్తిగా వక్రీకరించుటలో ఈపీఎఫ్ఓ వారు విజయం సాధించినారు. 

దేశంలో ఉద్దండ పండితులైన లాయర్లు ఈ విషయాన్ని నొక్కి వక్కాణించినారు. 

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

గౌరవ సుప్రీంకోర్టు వారు జాయింట్ ఆప్షన్లు ఇచ్చుటకు సమయము నాలుగు నెలలు కేటాయించినను మూడున్నర నెల సమయము గడిచిపోయిన తర్వాత నాలుగు నెలల సమయమునకు దగ్గరగా ఆన్ లైన్లో జాయింట్ ఆప్షన్ ఇవ్వవలసినదిగా కోరుట ఏ మూత్రము సమర్ధనీయము? ఈపీఎఫ్ పెన్షనర్లు ఏమాత్రం కంప్యూటర్ పరిజ్ఞానం లేక ఆన్-లైన్ లో ఆప్షన్లు సమర్పించుటకు పడిన అవస్థలు వర్ణానాతీతం.

చాలామంది ఆఫ్ లైన్ లో జాయింట్ ఆప్షన్ సమర్పించిన వారు ఎటు తోచక ఇప్పటికీ డోలాయమాన పరిస్థితులో ఉన్నారు.

వృద్ధాప్య దశలో ఉన్న చాలామంది ఈపీఎస్ పెన్షనర్లు కటిక దారద్య్రంలో దుర్భరమైన జీవితాలు అనుభవించుట సత్యదూరం కాదు

కేంద్ర ప్రభుత్వం వారు వీరికి చేయూతనందించుటలో పూర్తిగా విఫలమైనది. 

గౌరవ ప్రధానమంత్రి గారికి ఈపీఎస్ పెన్షనర్లు అంటే ఏమాత్రం సానుభూతి లేదని ఇప్పటికే 74 లక్షల మంది పెన్షనర్ల మనసులో ముద్ర వేసుకుని పోయినది. ఇట్లు కార్మిక శాఖ మంత్రి గౌరవశ్రీ భూపేంద్ర యాదవ్ గారు కానీ గౌరవ ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారి

కానీ ఏమాత్రం సహకరించే ఉద్దేశ్యం లేదని అనేకమార్లు తేటతెల్లమవుతున్నది. 

అనేకమార్లు పెన్షనర్ల మదిలో మనము ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా? లేదా ఏ ఆటవిక రాజ్యంలోనో, లేదా ఏ నియంత పరిపాలనలోనో ఉన్నామనే భ్రమ కలుగక మానదు. 

74 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్ల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. 

ఏదో అద్భుతం జరిగితే తప్ప మనకు న్యాయం జరిగే పరిస్థితి కాగడా వేసి చూసినా కనపడదు.

పది సంవత్సరముల నుండి అనేక హైకోర్టులలో విజయం సాధించిన కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడం మన దౌర్భాగ్యం తప్పు మరొకటి కాదనిపిస్తుంది.

 ప్రస్తుత పరిస్థితి ఏమనగా ఆన్ లైన్ లోను మరియు ఆఫ్ లైన్ లోను జాయింట్ ఆప్షన్లు పంపించి చేతులు దులుపుకున్నాము ఎవరు అవునన్నా కాదన్నా ఫలితాన్ని భగవంతునికి విడిచిపెట్టడం తప్ప మరి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్న విషయము యదార్థం.

అత్యంత ఆవేదనతో. 

మిత్రుడు.

రవీంద్ర కందుకూరి,

ప్రధాన కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్ సహకార కేంద్ర బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం

Thanks and credits to the contributor of this content.