Eps 95 pension latest news today

04.11.22 తేదీన సుప్రీం కోర్టు ఈపీఎస్ 95 అయ్యర్ పెన్షన్ కేసు తీర్పు ఇచ్చి దాదాపు ఇప్పటికి రెండు నెలలు కావస్తోంది.

ఈ తీర్పులో ముఖ్యంగా రెండు అంశాలు ఉన్నాయి. ఇందులో ఒకటి క్లారిటీ ఇచ్చిన అంశం రెండవది కన్ఫ్యూజన్ చేసిన అంశం.

Please press here to read in English version

మొదటి అంశం అయ్యర్ పెన్షన్ ఆప్షన్ కు కట్ ఆఫ్ తేదీని తొలగించి అందరు పెన్షనర్లు నాలుగు నెలల లోపల తమ జాయింట్ ఆప్షన్ EPFO కు ఇవ్వాలని చెప్పడం.

రెండవ అంశం 01.09. 2014 కు ముందు రిటైర్  అయిన వారు అయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇవ్వడానికి అర్హులు కాదని పాయింట్ ఉండటం.

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది రిటైర్డ్ అధికారులు సుప్రీంకోర్టులో తీర్పు మార్పు చేసి ఇవ్వడానికి మరియు క్లారిఫై చేయడానికి రివ్యూ పిటిషన్ వేయడం జరిగినది.

ఈ రివ్యూ పిటిషను ను ఫుల్ బెంచ్ కు రిఫర్ చేయడం జరిగింది.

దీనిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకొని ముందుకు నడిపించడం ప్రస్తుతం ఉన్న కర్తవ్యం.

ఇలా ఉండగా ఈపీఎఫ్ఓ సుప్రీంకోర్టులో ఇంకొక ఎస్ ఎల్ పి ని ఫైల్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

04.11.22 న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు తీర్పును ఇంప్లిమెంట్ చేయడానికి financial మరియు acturial ఇబ్బందులు ఉన్నట్టుగా EPFO చెబుతూ ఉన్నది.

ఒకవేళ ఈపీఎఫ్ఓ సుప్రీంకోర్టులో SLP గనుక దాఖలు చేసినట్లయితే హయ్యర్  పెన్షన్ కేసు మరీ ఏమలుపు తిరుగుతుందో తెలియదు.

ఎవరైనా పెన్షనర్లు ఈపీఎఫ్ఓను RTI ద్వారా,  సుప్రీంకోర్టు తీర్పు ఇంప్లిమెంటేషన్ గురించి అడిగినప్పుడు కానీ లేక లేబర్ మినిస్టర్ను అడిగినప్పుడు కానీ వారు చెబుతున్న సమాధానం ఒకటే సుప్రీంకోర్టు “తీర్పు పరిశీలనలో ఉంది” అని మాత్రం  చెబుతున్నారు.

EPFO, సుప్రీం కోర్టు నందు SLP ఫైలింగ్ న్యూస్ తాజా వార్త అయినప్పటికీ, అది జరుగుతుందో లేదో తెలియదు.

అలా SLP ఫైల్ చేసి ఈపీఎస్ 95 ఇప్పించగలరు ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడం అనేది అన్యాయమని చాలా మంది పెన్షన్లను వాపోతున్నారు.

ఏది ఏమైనాప్పటికీ హయ్యర్ పెంచిన కొరకు జాయింట్ ఆప్షన్ 2014 ముందు రిటైర్ అయిన వారు మరియు 2014 తర్వాత రిటైర్ అయిన పెన్షనర్లు కూడా తమ గడువు లోపల సబ్మిట్ చేసుకోవడం మంచిదని న్యాయనిపుణులు కొందరు  చెబుతున్నారు.

EPFO 2021-2022 ఆర్ధిక నివేదిక ప్రకారము:

1) 31-03-2022  నాటికీ వుద్యోగస్థులు చెల్లించిన మొత్తము

= 4,30,895.61 కోట్లు

2) ఈ 4,30,895.61 కోట్ల మీద వచ్చిన

చక్ర వడ్డీ: 3,35,303.96 కోట్లు

3) పెన్షన్ రూపములో చెల్లించినది: 1,22,604.21 కోట్లు

4) విత్డ్రాల్ బెనిఫిట్ ప్రకారము చెల్లించినది: 80,672.88 కోట్లు

5) భవిష్యత్తులో చెల్లిపులకొరకు ఉంచినది: 1,32,026.87 కోట్లు

మొత్తము: 3,80,940.65 కోట్లు

అనగా ఉద్యోగస్తులు చెల్లించిన 4,30,895.61 కోట్లు మరియు చక్రవడ్డీలో మిగిలిన 1,32,026.87 కోట్లు, అనగా మొత్తము 5,62,922.48 కోట్లు EPFO దగ్గర వున్నవి.

దీని సారాంశము:- మన చెల్లింపుల మీద వచ్చే వడ్డీ తో మనకు గత 27 ఏళ్లుగా పెన్షన్ మరియు విత్డ్రాల్ బెనిఫిట్ చెల్లెస్తున్నారు. అది కూడా 60.63% శాతము మాత్రమే.

G. శ్రీనివాస రావు, 89841 72459, WhatsApp: 86398 71817