How to save from Thunderbolt | steps in Telugu

How to save from Thunderbolt | steps in Telugu

Introduction: Thunder bolt ను తెలుగు లో పిడుగు అని అంటారు. పిడుగు అంటే తెలియని వారు వుండరు. పిడుగు పది ప్రతి వర్షా కాలములో కొంతమంది చనిపోతు ఉంటారు. ఎక్కువమంది చెట్టు క్రిందికి వెళ్ళడం ద్వారా చనిపోతూ ఉంటారు. ఇంతే కాకుండా ఇంకా కొన్ని కారణాల వలన కూడా కొంతమంది చనిపోతూ ఉంటారు. ఆ కారణాలు మరియు పాటించవలసిన భద్రతా నియమాలు ఈ వ్యాసం లో తెలుగుసుకుందాము.

How to save from Thunderbolt:

పిడుగు పాటి నుంచి తప్పించుకోవాలంటే చెట్ల క్రిందికి పోరాదు. ఇది చాలా ముఖ్యమైన చిట్కా. దీనిని ఎందుకు ముఖ్యమైనది అని ఆలోచిస్తున్నారా?. ఎందుకాగా వర్షాకాలంలో మీరు ఏ డైలీ వార్తా పత్రిక తీసుకున్నా వారంలో దాదాపు ఒక ఇద్దరు లేక ముగ్గురు పిడుగు మీద పది చనిపోతుంటారు. వారిలో దాదాపు అందరూ లేక 90% చెట్టు క్రిందికి పోయినవాళ్లే ఉంటారు. చెట్టు అతి త్వరగా పిడుగును ఆకర్షిస్తుంది. అటు ప్రక్కన పడ వలసిన పిడుగును సైతం చెట్టు తన చెంతకు ఆకర్షిస్తుంది. అటువంటి సమయంలో చెట్టుకు ఎవరు సమీపంలో ఉంటే వారు ప్రాణాలు కోల్పోతారు. ఇందులో సందేహము లేదు.

              వర్షాకాలంలో, ఏ వార్తా పత్రిక చూసినా, పిడుగు పాటు మరణాలు కన్పిస్తుంటాయి. అందులో చెట్టు క్రిందకు పోయి మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. ప్రాచీన       

steps in Telugu:

ఉరుముములు మెరుపులు ఉన్నప్పుడు షవర్ బాత్  స్నానం, కొళాయిల క్రింద స్నానము చేయరాదు.
స్విమ్మింగ్ పోల్స్ లో స్నానం చేయరాదు.
ఇనుప కంచెలకు, ఇనుప స్థంబాలకు వీలైనంత దూరంలో ఉండాలి.

Suggestions to Government:

ప్రభుత్వము వారు పిడుగు సమస్య ను గుర్తించారు. అందువలన వారు ఎక్కడైతే ఆకాశం మబ్బులు క్రమ్ముకుంటే, ఎక్కడైతే వర్షం చినుకులు మొదలైతే అక్కడి ప్రాంతం వారికి వెంటనే ప్రభుత్వము వారు ఈ క్రింది సమాచారం ను ఇంగ్లిష్ లోనూ తెలుగు లోనూ మొబైల్ కు సమాచారం అందిస్తున్నారు.
“రాగల 40 నిమిషాలలొ మీ గ్రామపరిధిలొ/పరిసరప్రాంతంలొపిడుగుపడేఅవకాశం ఉన్నది. సురక్షితమైన భవనాలలొఆశ్రయంపొందండి – రాష్ట్రవిపత్తులనిర్వహణసంస్థ.”
దయచేసి సంబంధించిన ప్రభుత్వాధికారులు ఈ ఆర్టికల్ లో ఉన్న సలహా ను పాటించి తదనుగుణంగా వాతావరణ అధికారులకు సమాచారంలో మార్పు చేయమని సూచనలు ఇవ్వవలసినదిగా కోరడమైనది.

“Any the time within the next 40 Minutes there is a chance of lightning strike in the vicinity of your village/habitation. Please take shelter in a safe building.”

సంతోషం, ఈ సమాచారం బాగానే ఉంది కాని, అందులో ఒక విషయం చేర్చాలి. అదేమిటంటే, “ఎవరూ చెట్టు క్రిందికి వెళ్ళకండి”. అప్పుడు ఈ విషయం అనగా చెట్టు క్రిందికి వెళ్లకూడదనే విషయం అందరికీ బాగా ప్రచారమౌతుంది. 

మీరు కూడా మీ స్నేహితులకు, బంధువులకు, మీకు తెలిసిన పెద్దలు,పిల్లలు అందరికీ ఈ విషయం మొహమాట పడకుండా తెలియచేయాలి. 

ఈ ఆర్టికల్ నందు ఉన్న సమాచారం వీడియో రూపం లో కూడా చూడవచ్చును.