Find comedy in telugu jokes:
Good comedy in Telugu jokes. Health is wealth. But mere health may not get you mental peace. The comedy in-jokes will give you mental relaxation and peace.

thanks and credits to the creator of this joke
భార్య: పెళ్ళిలో మా నాన్న మీ కాళ్లెందుకు కడిగాడు తెలుసా ?
భర్త: తెలియకేం, బురదలో దిగుతున్నావ్, ఎప్పుడైనా బురద అంటితే ఇలా కడుక్కోవాలని.
&&&&&&&
భార్య: డియర్, రెండో అంతస్తు చివర్లో క్రిందకు పడే స్టేజీలో ఉన్నాను. నా ప్రక్కనే, నీ మొబైల్ కూడా క్రిందకు పడే స్టేజి లో ఉందనుకుందాము. అప్పుడు ఎవరిని పట్టుకుంటావు ?
భార్య: మొబైల్ పోతే ఇంకా ఏమైనా ఉందా ?. మొబైల్ నే పట్టుకుంటా!
@@@@@@@
ఫ్రెండ్: ఒరే చింటూ, మీకు స్వీట్ షాప్ ఉంది కదా. రోజుకు గులాబ్ జాంలు ఎన్ని తింటావ్ ?
చింటూ: మా నాన్న గులాబ్ జామ్ లు లెక్క పెట్టి పెడుతుంటాడు. అందుకే వాటిని నాకి తిరిగి అక్కడే పెడుతుంటా.
compiled: credit goes ot the creator.
@@@@@@
Please click here to watch comedy jokes
మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది ?
మొదటి వ్యక్తి: మిమ్ములను ఎక్కడో చూసినట్లుంది. facebook లో ఉన్నారా ?
రెండవ వ్యక్తి: లేను
మొదటి వ్యక్తి: సరే, instagram లో ఉన్నారా ?
రెండవ వ్యక్తి: లేను.
మొదటి వ్యక్తి: సరే, whatsapp లో ఉన్నారా ?
రెండ వ్యక్తి: కాదు, మీ ఎదురింటి మిద్దె మీద అద్దెకున్నాను.
compiled: credit goes ot the creator.
@@@@@
EPS95 Pension Latest News
Please Press Below to Subscribe.
భర్త: ఇదిగో, రేపు మా నాన్న, అమ్మ వస్తున్నారు మన ఇంటికి.
భార్య: (విసుగ్గా), దేనికీ?
భర్త: ఈ మధ్య మా నాన్నకు వ్యాపారంలో లాభం వచ్చిందట. ఒక రెండు లక్షలు ఇచ్చి వెళ్దామని
వస్తున్నారు. ఎందుకంత చిరాకు?
భార్య: కాదండీ, వారు వచ్చేది బస్సుకా, ట్రైన్ కా అని.
compiled: credit goes ot the creator.

compiled: credit goes ot the creator.
@@@


Please click here to read jokes in telugu
జోక్ మనసుకు టాబ్లెట్ వంటిది.
మనసుకు హత్తుకునే జోకులు దొరికితే కాసేపు తృప్తిగా నవ్వుకుంటాము. ఇటీవలి కాలంలో మనుష్యులు నవ్వుకోవడం తక్కువైంది.
ఎక్కువ సమయం మొబైల్ లో గడపడం ఎక్కువైంది.
రోజూ మనసారా నవ్వుకోవడానికి ఓ పది నిముషాలు కేటాయించడం ఎంతైనా మంచిది.
ఈ మధ్య నవ్వుకోవడానికి ప్రత్యేకంగా, laughing clubs వచ్చాయి.
Tv లలో కూడా, జోకుల కార్యక్రమాలు conduct చేస్తున్నారు. ఇక సినిమా లలో మధ్య, మధ్య లో జోకులు సరే సరి.
ఈ మధ్య వెబ్సైట్ లలో, బ్లాగులలో జోకుల సైట్స్ ఎక్కువగానే వస్తున్నాయి.
మనిషికి కేవలం సంపద ఉంటే సరిపోదు. దానిని అనుభవించడానికి ఆరోగ్యం ఉండాలి.
మనిషికి కేవలం ఆరోగ్యం ఉంటే సరిపోదు. ఆనందించడానికి హాస్యం కావాలి.
హాస్యం, సహజసిద్దమై ఉండాలి.
నవ్వు మనసారా ఉండాలి. కృత్రిమమైన నవ్వుతో హాస్యం జనించదు.
Tv లలో వచ్చే హాస్య కార్యక్రమాలలో కొన్నిటిలో సహజసిద్ద్మైన నవ్వు తక్కువగా ఉంటుంది.
టెక్స్ట్ రూపంలో కాని, వీడియొ రూపంలో కాని కార్టూన్ రూపం లో గాని వచ్చే నవ్వులు సహజంగా ఉంటాయి.
Joking is like a tablet to the mind.
If we find touching joking, we will laugh with satisfaction for a while. Laughter has become less common in recent times.
More time spent on mobile.
It’s best to set aside ten minutes to laugh out loud every day.
In the meantime came the laughing clubs, specifically for laughing.
joking in cinemas also creating natural fun.
Immunity power
మొదటి ఆమె: “మీ ఇద్దరు భార్య భర్తలు మీ immunity పెంచుకోవడం కోసం రోజూ యోగాసనాలతో పాటు, మల్టీ విటమిన్ జింక్, సి విటమిన్, కషాయం , పసుపు వేసిన పాలు , బాదం పప్పులు … ఇలా అన్నీ తినడం మొదలు పెట్టారు కదా. ఇవి దాదాపు నెల నుంచీ వాడుతున్నారు గదా. మీలో ఏమైనా improvement కన్పించిందా?” అని అడిగింది తాపీగా.
రెండవ ఆమె: ఇదివరకు ఎప్పుడైనా ఇద్దరం గొడవపడితే … అది అరగంట మాత్రమే .. ఇప్పుడయితే .. రెండు మూడుగంటలు సాగుతోంది పిన్నిగారు
కథ
పాంచల్య దేశ రాజు పర్వత సేనుడు అనుకుందాము. ఆయనకు ఆర్ధికంగా, రాజ్య పరంగా దాదాపు పర్వతానికున్నంత బలం ఉంది.
ఆయనకు లేని వస్తువు అంటూ ఏదీ లేదు.
తన చుట్టూ ఉన్న పది రాజ్యాలకు ఆయనే మొనగాడు. నిజానికి బలశాలి కూడా.
అయినా, ఆయనకు ఏదో కొరత ఉంది. ఆ కొరత గురించి ఏదో ఒకటి తేల్చుకోవాలనుకున్నాడు.
ఒకరోజు, తన మంత్రి మానస వర్మను చెంతకు పిలిచి, “వర్మా!, ఒక మాట!”
“ఏమిటి మహారాజా!”
“వర్మా!, దేవుడి దయవల్ల నాకు తీరని కోరికంటూ ఏమీ లేదు. కానీ… కానీ…”
“చెప్పండి మహరాజా! ఈ దుర్భేద్యమైన కోటలో మీకు తీరని కోరికంటూ ఏమీ ఉండకూడదు. ఉందంటే, దానికి నేనే బాధ్యత వహిస్తాను రాజా!” అన్నాడు.
“ఇప్పటికీ దారివచ్చావు మహామంత్రీ” అన్నాడు రాజు.
“సెలవివ్వండి మహారాజా”
“ఈ మధ్య ఒకరోజు, మన పరిపాలన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామని మారువేషంలో కొన్ని వీధులు కలియతిరిగాను. అక్కడ కొన్నిచోట్ల నేను గమనించిన విషయాలివి. “చిన్న చిన్న రైతులు, వ్యాపారులు సైతం రోజులో కనీసం ఒక అరగంటైన ఆనందంగా గడుపుతుంటారు. మరి నేనేమో ఒక నిముషమైన నవ్వుతూ గడపలేక పోతున్నాను. అందుకు నేను చింతిస్తున్నాను. నేను కూడా అలా ఆనందంగా గడపడానికి మార్గం చెప్పండి మంత్రి గారూ” మనసులో మాట బయటపెట్టాడు రాజు.
అందుకు మంత్రి, “మీరు చెప్పింది అక్షరాలా నిజం రాజు గారూ, ఎన్ని రాజ్యాలు జయించినా, ఎంత సంపద కూడపెట్టినా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా మొహం మీద నవ్వు లేకపోతే, కట్టుకున్న భార్యామణి కూడా హర్షించదు రాజా!. ఇది మీకే కాదు, ఎవరికైనా వర్తిస్తుంది మహారాజా!.
“మీరుచెప్పింది ఒప్పుకుంటాను. మరి పరిష్కారం”?
“ఇకమీదట, నేను మంచి, మంచి జోకులు, కార్టూన్లు సేకరించి మీకు ఇస్తాను. అప్పుడప్పుడూ వాటికి సమయం కేటాయించండి.” అన్నాడు.
“భేష్. బాగుంది. ఆలస్యం చేయకుండా రేపటి నుంచే ఆ పనిలో ఉండండి.” అంటూ ఆజ్న ఇచ్చాడు రాజు గారు.
Tags
jokes in telugu
jokes
funny jokes
తెలుగులో జోకులు
జోక్స్
జోకులు