Sita Ramam telugu film video songs latest 22

Sita Ramam telugu film video songs:

In this Sita Ramam telugu film video songs post, there are all audio songs in one phrame and lyrics with video songs. Enjoy the songs and comment.

ఈ సీతా రామ తెలుగు సినిమా వీడియో పాటల పోస్ట్‌లో, ఒకే ఫ్రేమ్‌లో అన్ని ఆడియో పాటలు మరియు వీడియో పాటలతో కూడిన సాహిత్యం ఉన్నాయి. పాటలను ఆస్వాదించండి మరియు వ్యాఖ్యానించండి.

ఇంతందం దారి మళ్ళిందా – Sita Ramam

ఇంతందం దారి మళ్ళిందా
భూమిపైకే చేరుకున్నదా
లేకుంటే చెక్కి ఉంటారా
అచ్చు నీలా శిల్ప సంపదా

జగత్తు చూడనీ
మహత్తు నీదేలే
నీ నవ్వు తాకి
తరించె తపస్సీలా

నిశీదులన్నీ తలొంచే
తుషారాణివా

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే

నీదే వేలు తాకి
నేలే ఇంచు పైకి
తేలే వింత వైఖరీ

వీడే వీలు లేని
ఏదో మాయలోకి
లాగే పిల్ల తెంపరీ

నదిలా దూకేటి
నీ పైట సహజగుణం
పులిలా దాగుంది
వేటాడే పడుచుతనం

దాసోహమంది నా ప్రపంచమే
అదంత నీ దయే

విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే

చిలకే కోక కట్టి
నిన్నే చుట్టుముట్టి
సీతాకోకలాయేనా

విల్లే ఎక్కు పెట్టి
మెల్లో తాళి కట్టి
మరలా రాముడవ్వనా

అందం నీ ఇంట
చేస్తోందా ఊడిగమే
యుద్ధం చాటింది
నీపైన ఈ జగమే

దాసోహమంది నా ప్రపంచమే
అదంత నీ దయే

విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే

ఓ సీతా వదలనిక తోడౌతా – Sita Ramam

ఓ సీతా వదలనిక తోడౌతా
రోజంతా వెలుగులిడు నీడౌతా

దారై నడిపేనే చేతి గీత
చేయి విడువక సాగుతా
తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా

కనులలో మెరుపులా తారాడే
కలని నేనౌతా

హే రామా ఒకరికొకరౌతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
రేపేం జరుగునో రాయగలమా
రాసే కలములా మారుమా

జంటై జన్మనే గీయగలమా
గీసే కుంచెనే చూపుమా
మెరుపులో ఉరుములో దాగుంది
నిజము చూడమ్మా

ఓ సీతా వదలనిక తోడౌతా
హే రామా ఒకరికొకరౌతామా

నేరుగా పైకి తెలుపని
పలుకులన్నీ నీ చూపులై
నేలపై వాలుతున్నవి
అడుగు అడుగున పువ్వులై

ఓ వైపేమో ఓపలేని మైకం
లాగుతోంది మరోవైపు లోకం

ఏమి తోచని సమయమో
ఏది తేల్చని హృదయమో
ఏమో బిడియమో నియమమో
నన్నాపే గొలుసు పేరేమో

నిదుర లేపడుగు ఒక్క
నీ పేరే కలవరిస్తానులే
నిండు నూరేళ్ల కొలువనే
తెలిసి జాగు చేస్తావులే

ఎపుడు లేదే ఏదో వింత బాధే
వంత పాడే క్షణం ఎదురాయే

కలిసొస్తావా ఓ కాలమా
కలలు కునుకులా కలుపుమా
కొలిచే మనిషితో కొలువు ఉండేలా
నీ మాయ చూపమ్మా

హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
దారై నడిపేనే చేతి గీత
చేయి విడువక సాగుతా

తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే
కలని నేనౌతా

కానున్న కళ్యాణం ఏమన్నది

కానున్న కళ్యాణం ఏమన్నది
స్వయంవరం మనోహరం
రానున్న వైభోగం ఎటువంటిది
ప్రతిక్షణం మరో వరం

విడువని ముడి ఇది కదా
ముగింపులేని గాథగా

తరముల పాటుగా
తరగని పాటగా
ప్రతి జత సాక్షిగా
ప్రణయము నేలగా సదా

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా

చుట్టు ఎవరూ ఉండరుగా
గిట్టని చూపులుగా
చుట్టాలంటూ కొందరుండాలిగా
దిక్కులు ఉన్నవిగా

గట్టి మేళమంటూ ఉండదా
గుండెలోని సందడి చాలదా
పెళ్లి పెద్దలెవరు మనకి
మనసులే కదా అవా సరే

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా

తగు తరుణం ఇది కదా
మదికి తెలుసుగా
తదుపరి మరి ఏమిటటా
తమరి చొరవట

బిడియమిదేంటి కొత్తగా
తరుణికి తెగువ తగదుగా
పలకని పెదవి వెనక
పిలువు పోల్చుకో సరే మరి

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా

వస్తా నే వెంటనే
ఉంటా నీ వెంటనే

ముద్దంటిన చెంప పై
తడి ఆరనే లేదులే
మాటొకటి చెప్పెంతలో
పయనాలు మొదలాయెనే

ఓ ప్రేమా ఓ ప్రేమా
అవసరమా అవసరమా ఆ ఆఆ
మాయే నీ మాయే నీ ఈ ఈఈ
చిరునామా చిరునామా ఆ ఆఆ

మనసంతా నీవే ప్రియా
విరహాన్ని చంపేదెలా
అంతరిక్షం అంచుదాక
ప్రేమ తాకిందిగా

నీతో ఙ్ఞాపకాలే
ఈ మంచుల అవి కరగవే
ఈ నీ పరిమళాలే
గుండెలో నిండెలే

ఓ ప్రేమా ఓ ప్రేమా
అవసరమా అవసరమా ఆ ఆఆ
మాయే నీ మాయే నీ ఈ ఈఈ
చిరునామా చిరునామా ఆ ఆఆ

ఇటు చూడవా ప్రియతమా
ఎడబాటు అనుకోకుమా
కాళీ కింద చిక్కుకుంది
చూడు నా ప్రాణమే

దూరం ఆవిరాయే
నీ వెచ్చనీ నిశ్వాసలో
నిదురే చెదిరేలోపే
తిరిగిరా స్వప్నమా

ఓ ప్రేమా ఓ ప్రేమా
అవసరమా అవసరమా ఆ ఆఆ
మాయే నీ మాయే నీ ఈ ఈఈ
చిరునామా చిరునామా ఆ ఆఆ

Press here to watch super hit old Telugu video songs in addition to Sita Ramam

Press here to watch some more super hit songs

Tags

sita ramam

sita ramam audio songs

sita ramam video songs