What are the needs of older person:
అదేంటంటే ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సమస్యలలో ఉన్న ఒక సమస్య గురించి మనం చర్చించుకుందాం అదేంటంటే వయోవృద్ధుల ఆహారం !
మన అందరి ఇళ్ళల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండనే ఉంటారు, అవునా!
అందుకే …………
What are the needs of older person
మనందరికీ వాళ్ళ గురించి ఒక పెద్ద సమస్య ఏంటంటే వాళ్లు తినే ఆహారం గురించి ఇంట్లో చిన్న పిల్లలకు ఒకటి చెయ్యాలి పెద్దవాళ్లకు ఒకటి చేయాలని ఇంట్లో కూతుళ్ళు కోడళ్ళు భార్యలు చాలా సతమతమవుతుంటారు
EPS95 Pension Latest News
Please Press Below to Subscribe.
పెద్దవయసు వారి కోసం వారు ఎంచుకునే ఆహారం ఏంటంటే త్వరగా జీర్ణమయ్యే సులువుగా నమల కలిగే ఆహారం!
అలాగే వారికి ఈ వయసులో కావలసింది బలమైన ఆహారం మంచి పౌష్టికాహారం మంచి న్యూట్రీషన్లు ఉన్న ఆహారం
వారి శరీరానికి కాస్తంత సత్తువ శక్తి వారి పని వారు మాత్రమే చేసుకోదగ్గ ఓపిక ఇది ఉంటే చాలు అని వారు అనుకుంటారు!
వృద్ధులు చిన్న పిల్లల తో సమానం అని అంటారు కదా వారు నోరు తెరచి ఏదీ అడగలేరు, అడిగితే ఇంట్లో పిల్లలు ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు, మనం వారికి భారం కాకూడదు అని కూడా అనుకుంటారు, ఒకరికి ఇబ్బంది పెట్టేలా మన పనులు వాళ్లకి అప్పచెప్పాలి అని కూడా అనుకోరు
పెద్ద వయసు వారు మన నుంచి కోరుకునేది

What are the needs of older person
వృద్ధాప్యంలో డబ్బు అవసరం
నువ్వు వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనం నిండా ఎన్నో నక్షత్రాలు. క్రమక్రమంగా ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి.
నీ తోటి వయసు వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు.
నీకు అప్పటివరకూ అండగా ఉన్న నీ తల్లిదండ్రులూ, అమ్మమ్మా నాయనమ్మలూ, తాతయ్యలూ ఎప్పుడో నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నీ భాగస్వామి కూడా నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉండవచ్చు.
బయటకి రాలేని నిస్సహాయతతో నీ స్నేహితులు ఇళ్ళల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు.
నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు.
నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు. నీ మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది.ఈ సొసైటీ నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయివుంటుంది.
దాహంతో దూరంగా ఎక్కడో ఒక కాకి కావుమని అరుస్తూ ఉంటుంది. నీ లాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు. నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది.
అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది.
పక్క మీద గంటల, రోజుల తరబడీ పడుకొని ఉండటం దినచర్య అవుతుంది. పుట్టిన కొత్తలో నెలల తరబడి పక్క మీద శిశువు కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి సంభవిస్తుంది.
ఒకటే తేడా ఏమిటంటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి తల్లి ఉంది. ఇప్పుడెవరూ లేరు. అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ. నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు.
నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు.
ఒళ్ళు వెచ్చబడితే చలిలో తిరిగావనీ, జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం చేశావనీ, కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావనీ నిన్ను మందలిస్తూ ఉంటారు.
ప్రొద్దున్న లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో, కీళ్ళ నొప్పులో ప్రారంభం అవుతాయి. బాత్‌రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపకశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళ అని చెప్పటం మొదలైనవి అన్నీ నీ జీవితంలో భాగమైపోతాయి.
నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే, నువ్వు సంపాదించిన డబ్బు నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా, చూసీ చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క గదిలో నీ వాళ్ళు చర్చిస్తూ ఉంటారు.
ఇవి వినడానికి చేదుగా ఉన్నా, పచ్చి నిజాలు (Available in WhatsApp. Thanks to the contributor)
పసి వయస్సులో ఆనందం కావాలనిపిస్తుంది.
పడుచు వయసులో ప్రేమ కావాలనిపిస్తుంది.
బాధ్యతలు మోసే సమయానికి తోడు కావాలనిపిస్తుంది.
కాని పెద్దరికం వచ్చాక పలకరింపు చాలు అనిపిస్తుంది. (Available in WhatsApp. Thanks to the contributor)
Please watch a good video on the older people
●సమయం ●ప్రేమ ●అభిమానం ●మంచి శక్తినిచ్చే ఆహారం !!
వారికి సరియైన శక్తి ఉన్న ఆహారం అంద చేయగలిగితే వారు ఎవరి పైనా ఆధారపడి ఇబ్బంది పెట్టకుండా ఉంటారు…
కావున ఇన్ని రోజులు మన కోసం మన కుటుంబం కోసం ఎంతో కష్టించి శ్రమించిన పెద్ద వారి కోసం కూడా మంచి పౌష్టికాహారాన్ని ఎంచుకోండి చివరిగా ఇంకొక మాట ఆ పౌష్టికాహారం ఎంచుకోవడం ఎలా అని మీకు సందేహం ఉంటే మీ క్షేమం కోరుకునే ఉత్తమ కోచ్ గా నేను మీకు సహాయ పడగలను..
కామెంట్ రూపంలో కింద మీ వివరాలు ఇవ్వగలిగితే నేను మీకు సంప్రదించి సహాయం చేస్తాను.
Please click the Text here to know similar content.